కేంద్రప్రభుత్వం జమ్మూకాశ్మీర్ శాంతి భద్రత పరిస్థితుల పై దృష్టి పెట్టింది.తాజగా జమ్మూలో యాత్రికులతో వెళ్తున్న బస్సు పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 10మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే.ఈ ఘటన పై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెల్లడించాయి.మూడు నెలల క్రితమే ఉగ్రవాదులు జమ్మూలో పెద్ద ఎత్తున దాడులు చేయాలనీ ప్రణాళిక రచించినట్టు దర్యాప్తు సంస్థలు తెలిపాయి.జమ్మూలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా దాడులు చేసి మారణహోమం సృష్హించేందుకు ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేసినట్టు దర్యాప్తు పేర్కొన్నాయి.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తుంది.
ఆదివారం ఢిల్లీలో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశనికి జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్,కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజిత్ భల్లా,జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు జమ్మూ రాష్ట్రానికి చెందిన కీలక శాఖ అధికారులు హాజరయ్యారు.వరుసగా జరుగుతున్నా ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా అధికారులకు కీలక సూచనలు చేశారు.ఉగ్రదాడులను అరికట్టేందుకు భద్రత దళాలు వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.మరోవైపు జూన్ 29 నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవుతుందని,ఇలాంటి సమయంలో ఉగ్రదాడులు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున భద్రత బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు.అంతర్జాతీయ సరిహద్దులతో పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.