Friday, September 20, 2024
spot_img

ఆదాబ్ కథనంపై దర్యాప్తు షురూ

Must Read
  • మలక్ పేట సెయింట్ జోసెఫ్ స్కూల్ అరాచకం
  • వేలల్లో డోనేషన్లు, వచ్చిరాని కండీషన్లు
  • బుక్స్ కు ఎక్స్ ట్రా డబ్బులు వసూల్
  • టీచర్లకు కనీస వేతనాలు కరవు
  • పీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ జాడేలేదు
  • ప్రతియేటా ఆడిట్ రిపోర్ట్ సమర్పించని యాజమాన్యం
  • ఆర్.జే.డీ, డీఈఓకు కంప్లైంట్ చేసిన ఆదాబ్

కార్పోరేట్, ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల జేబులను గుల్లచేస్తున్నాయి. పైసల కోసం రోజు రోజుకు దిగజారి ప్రవర్తిపోతున్నాయి. అలాంటి కోవకే చెందినది హైదరాబాద్ లోని మలక్ పేట, ఆస్మన్‌ఘడ్‌లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ యాజమాన్యం అరాచకాలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. మూడ్రోజుల క్రితం ‘డోనేషన్ కేవలం రూ.60వేలు మాత్రమే’ అనే శీర్షికతో ఆదాబ్ వచ్చిన కథనానికి విద్యాశాఖ రెస్పాండ్ అయింది. సెయింట్ జోసెఫ్ లో వేలల్లో డోనేషన్లు, లక్ష వరకు స్కూల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు, బుక్స్ కు రూ6 నుంచి రూ.8వేలు వసూలు చేయడంపై ఈనెల 21న వార్తా ప్రచురితం చేయడం జరిగింది. కాగా దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. సెయింట్ జోసెఫ్ వసూలు చేస్తున్న డోనేషన్లు, అధిక ఫీజులపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఆర్.జే.డీ, డీఈఓకు ఆదాబ్ ఫిర్యాదు

మలక్ పేట, ఆస్మన్‌ఘడ్‌లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ యాజమాన్యం అరాచకాలపై.. రీజనల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా ఎడ్యూకేషన్ ఆఫీసర్, డిప్యూటీ ఈఓకు ఆదాబ్ హైదరాబాద్ కంప్లైంట్ చేయడం జరిగింది. సంబంధిత స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. డోనేషన్లు, అధిక ఫీజులు వసూలు చేయడం, బుక్స్ ను ఎక్కువ రేట్లకు అమ్మడం సహా టీచర్లకు సరైన జీతాలు ఇవ్వకపోవడంపై విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కార్పోరేట్ స్కూల్స్ ల్లో వేలల్లో ఫీజులు ఉండడంపై ఫిర్యాదు చేసింది. విద్యా హక్కుచట్టంలోని నిబంధనలు పాటించేలా, పేద ప్రజల పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేలా ఫీజులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

కేజీ నుంచి టెన్త్‌ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కార్పోరేట్‌ స్కూల్స్‌ ప్రజలను జలగల్లా పట్టిపీడుస్తున్నాయి. ఈ క్రమంలో పేదోడి పిల్లోడు ప్రైవేటు పాఠశాలలో చదువుకోవాలంటే చాలా కష్టసాధ్యం అవుతుంది. సెయింట్‌ జోసఫ్‌ మైనార్టీ స్కూల్‌లో వేలల్లో డోనేషన్లు, ఫీజులతో పాటుగా బుక్స్‌కు దాదాపు రూ.8 వేల వరకు డబ్బులు వసూలు చేస్తుండడంతో తమ చిన్నారులను స్కూల్లో వేసే పరిస్థితి లేదు. విద్యాహక్కు చట్టం 2009లోని నిబంధనలు పట్టించుకోవడం లేదు. అడ్మిషన్ తీసుకునేందుకు పేరెంట్స్ కు డిగ్రీ అర్హత పెట్టడంతోపాటు వారికి ఇంగ్లీష్ రావాలనే నిబంధనలు విద్యాహక్కు చట్టానికి విరుద్ధం. అదేవిధంగా క్లాస్ కు లిమిట్ గా విద్యార్థులను చేర్చుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఆదాయంలో 50శాతం కేవలం టీచర్ల కోసం కేటాయించాలి. జీతాలు, కనీస అవసరతలు, పీఎఫ్, ఈఎస్ఐతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ఇతర బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ స్కూల్‌ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను భేఖాతర్‌ చేస్తుంది.

ఆడిట్ ముచ్చటే లేదు:

విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతియేటా స్కూల్ మేనేజ్ మెంట్ ప్రభుత్వానికి ఆడిట్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. సంవత్సరానికి వచ్చే ఆదాయం ఎంత.. స్కూల్ లో ఉన్న స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు.. వారి ఫీజులేంటి, టీచర్ల జీతాలు, నిత్యావసర వస్తువులు, ఫర్నీచర్, ఇతరత్రా ఖర్చులు ఎంత ఏంటి అనేది పూర్తి లెక్కలను విద్యాశాఖకు చూపించాల్సి ఉంటుంది. వేతనాలు ఎంత ఇస్తున్నారు, ఇన్సురెన్స్ సహా పీఎఫ్, ఈఎస్ లాంటివి ఉద్యోగులకు కల్పిస్తున్నారో, లేదో కూడా ఆడిట్ రిపోర్ట్ లో వివరించాలి. కానీ లక్షల్లో ఫీజులు వసూలు బ్యాంక్ అకౌంట్లను వేరువేరు మెయింటెన్ చేస్తూ లెక్కలు చూపడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది.

విద్యా హక్కు చట్టం అమలు కావట్లే:

విద్యాహక్కు చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతి ప్రవేశాల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు 5శాతం పేదలకు ఫ్రీ సీట్లు ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. సెక్షన్‌-23 ప్రకారం ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి. సెయింట్‌ జోసఫ్‌ హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అడ్మిషన్‌ సమయంలో రూ. 60వేల నుండి రూ.70వేల వరకు డోనేషన్లు వసూలు చేస్తున్నారనేది విశ్వసనీయంగా తెలిసింది. ఇదీ విద్యా హక్కు చట్టం ప్రకారం నేరం. ఇదీ నిజమని నిరూపణ అయితే పాఠశాల యాజమాన్యానికి 10రెట్లు పెనాల్టీ వేయాల్సి ఉంటుంది. స్కూల్ అడ్మిషన్లు జూన్‌లో చేయవల్సింది పోయి నవంబర్‌ నుంచి అడ్మిషన్లు ప్రారంభించడం గమనార్హం.

ఇంత జరుగుతున్న సెయింట్ జోసెఫ్ హైస్కూల్ పై విద్యాశాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులు, బుక్స్ రేట్లు తగ్గించేలా, పేరెంట్స్ నుంచి వసూలు చేసిన డోనేషన్లను తిరిగి ఇప్పించాలని మేధావులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This