-వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’కి చైర్మన్గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త,దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్రా అంగీకరించారని,కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.