భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరోనా సమయంలో భారత అందించిన సహకారాన్ని గుర్తిస్తూ మోదీకి కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ఆ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత ప్రధాని మోదీ విశేష కృషి చేశారని తెలిపింది. గయనలో జరిగే ఇండియా- కరికొమ్ సదస్సులో అవార్డు అందజేస్తామని వెల్లడించింది.