కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోనే హిందూ వ్యతిరేకత దాగి ఉందని,దానిని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బయటపెట్టారని విమర్శించారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి.హిందువులంతా దేశద్రోహులని,విధ్వంసకరులని,రకరకాలుగా మాట్లాడటం హిందూత్వం పై రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయాన్ని బయటపెడుతుందని అన్నారు.రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం బాలస్వామి పత్రిక ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత దాగి ఆరోపించారు.సెక్యులరిజం పేరుతో హిందుత్వాన్ని అణచివేయాలనే బలమైన కోరిక కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు.అయోధ్య రామ మందిరాన్ని ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని కూడా బహిష్కరించిందని గుర్తు చేశారు.హిందువులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ, హిందువులను అంతం చేయాలని టెర్రరిస్టులతో స్నేహం చేసే మనస్తత్వం కాంగ్రెస్ నేతలది తీవ్ర స్థాయిలో విమర్శించారు.రాజకీయల్లోకి హిందుత్వాన్ని లాగి హిందూ ధర్మాన్ని పలుచన చేయవద్దు అని రాహుల్ గాంధీకి సూచించారు. చెట్టును, పుట్టను, మట్టిని, ప్రకృతిని, సమస్త జీవరాశిని ప్రేమించి అక్కున చేర్చే మనస్తత్వం హిందూ ధర్మానిదని ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదులను,జాతి విద్రోహశక్తులను,మతమార్పిడి మాఫియాను పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. శాంతియుత జీవనంతో తోటి వారిని అక్కున చేర్చే హైందవత్వాన్ని విమర్శించిన రాహుల్ గాంధీ వెంటనే సమస్త హైందవ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికలలో కేవలం 100 సీట్లు రాగానే హిందుత్వంపై విషం కక్కడం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ, రేపు అధికారంలోకి రాగానే హిందుత్వం అంతం కోసం తీవ్రంగా కృషి చేయడానికి ఇప్పటినుంచి సంకేతాలు ఇస్తున్నట్లు అర్థమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు.హిందూ సమాజమంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.