ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు ఈరోజు సీఎం చంద్రబాబు కర్నూల్ జిల్లా ఓర్వకల్ లో పర్యటించాల్సి ఉంది.కానీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పర్యటన రద్దు అయింది.