ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది.వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని తెలిపారు.మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు,ఇంట్లో వరద నీళ్ళు వచ్చిన బాధితులకు రూ.10 వేలు,మొదటి అంతస్తులో ఉన్నవారికి రూ.10,000,చిరు వ్యాపారులకు రూ.25 వేలు,చేనేత కార్మికులకు రూ.15 వేలు,బోట్లు పూర్తిగా ధ్వంసమైతే రూ.20 వేలు అందజేస్తామని తెలిపారు.ఎంఎస్‌ఎంఈలకు రూ.1.5 లక్షలు సాయం చేస్తామని వెల్లడించారు.