తెలంగాణ మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏపీ మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు.మీరు చేసిన అవినీతి,అహంకారం,అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియా మిత్రులైన జగన్,కేతిరెడ్డిలను ఓడించాయని విమర్శించారు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో ధరణి పేరుతొ మీరు నడిపిన భూ మాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతొ మీ మిత్రుడు ప్రభుత్వ,అసైన్డ్,ప్రైవేట్,ప్రజల ఆస్తులను ఆక్రమించారని ఆరోపించారు.చివరికి చెరువులు,కొండలను కూడా కబళించడాని విమర్శించారు.మీరు చేస్తున్న అవినీతి పై ప్రశ్నిస్తే నాలుగు సంవత్సరాల క్రితం బ్లాక్ చేశారని గుర్తుచేశారు.ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్దిఫికేట్ లు ఇచ్చుకొని ఓదార్చుకోండి అని ట్విట్ చేశారు.