జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు.ఈ విధానం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు.రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని ఆరోపించారు.ప్రధాని మోదీ,అమిత్ షాకు తప్ప,ఎవరికి బహుళ ఎన్నికలు సమస్య కాదని తెలిపారు.ఈ నిర్ణయం పై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.జమిలి ఎన్నికలకు సంబధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టె అవకాశముంది.ఎన్డీఏ హయంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు.