ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. ఒక్కసారిగా ప్రధానిపైన దాడి జరగడంతో అక్కడున్న ప్రజలు ఉలిక్కిపడ్డారు.రాజధాని నగరం కోపెన్హాగెన్లో ఒక దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రధాని అధికార కార్యాలయం కూడా దాడి పై ఓ ప్రకటనను విడుదల చేసింది. కోవెన్ హాగెన్ లోని కాల్తోర్ వెట్ ప్రాంతంలో దుండగుడు ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని అధికార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం మేటే ఫ్రెడ్రిక్సన్ ఆరోగ్య పరిస్థితి పై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఈ ఘటన పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తునట్టు పేర్కొన్నారు.