ఇండియన్ నేవీకి చెందిన సబ్‌మెరైన్ ప్రమాదానికి గురైంది. గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ళ దూరంలో సబ్‌మెరైన్ ను ఫిషింగ్ బోటు ఢీకొట్టింది. ఈ ఘటనలో బోటులో ఉన్న ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 13 మంది ఉన్నారు. వీరిలో 11 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. మరో ఇద్దరి...
ఛత్తీస్‌గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన 10 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
ఒడిశా నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం...
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా
మాజీ సీఎం, వైసీపీ అధినేత ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ మాజీ సీఎం జగన్ కు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల...
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత పై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు...
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ జ్యోతిక్షేమాబాయి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ పట్టణ శివారులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు వరంగల్ జిల్లాకు చెందిన తాళ్ల కార్తీక్ భూమికి సంబంధించిన వివరాల కోసం గత నెల 28న...
తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్
పోలీస్ ఉద్యోగం అంటే క్రమ శిక్షణతో కూడుకున్నదని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం హైదరాబాద్ ఆర్.బి.వీ.ఆర్ ఆర్, శిక్షణ సెంటర్ లో ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, న్యాయం కోసం న్యాయమైన...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5.51 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 02 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జీష్నుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్, అధికారులు స్వాగతం పలికారు. నేడు, రేపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు, రేపు హైదరాబాద్...
గోవాలోని పనాజీ వేదికగా జరుగుతున్న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగలో టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగ చైత్యన్య, శోభిత సందడి చేశారు. ఈ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో సినీ అగ్ర తారలు తదితరులు హాజరై సందడి చేశారు. అక్కినేని నాగచైత్యన్య, శోభిత ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తు అందరి దృష్టిని...
రష్యా తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో దాడి చేసింది. డెనిపర్ నగరంలో ఈ దాడి జరిగినట్లు కీవ్ వాయుసేన తెలిపింది. అయితే కచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. ఈ ఖండాంతర క్షిపణి వల్ల ఉక్రెయిన్ ఎంత మేర నష్టపోయిందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఖండాంతర క్షిపణి ప్రయోగంపై...
ప్రొద్దుటూరుకు చెందిన సివిల్ ఇంజనీర్ గండికోట సుబ్బారావు, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా...