Friday, September 20, 2024
spot_img

తప్పుడు ప్రచారం మానుకోవాలి

Must Read
  • గత 15ఏళ్లుగా ప్రమోషన్లు లేక అసిస్టెంట్ పీపీలకు తీవ్ర అన్యాయం
  • అసిస్టెంట్ పీపీల ప్రమోషన్లు అనేదీ అవాస్తవం
  • అపోహాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదు
  • తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి. శైలజ

క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమోషన్ల విషయంలో పలువురు న్యాయవాదులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ( క్యాడర్ ) అసోసియేషన్ అధ్యక్షురాలు పి. శైలజ అన్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కు ప్రమోషన్లు ఇవ్వడం వల్ల యువ న్యాయవాదులకు అవకాశాలు లభిస్తాయన్న విషయాన్ని వారు మరవకూడదని అన్నారు. అసలు వాస్తవాలను పక్కనబెట్టి, లేనిపోని అపోహాలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆమె హితవు పలికారు.

తెలంగాణలో ఉన్న మొత్తం 220 సెషన్స్ కోర్టులలో 108 టెన్యూర్ పీపీలు, 43 మంది క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మాత్రమే ప్రమోషన్లు పొంది పీపీలుగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. వాస్తవం ఇలా ఉండగా పలువురు న్యాయవాదులు ఉద్దేశ్య పూర్వకంగా అసిస్టెంట్ పీపీల ప్రొమోషన్ల విషయంలో లేనిపోని దుష్ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. నిజానికి గత పదిహేనేళ్లుగా ప్రమోషన్లు లేక అసిస్టెంట్ పీపీలు అన్యాయానికి గురవుతున్నారని, వాళ్లకి ప్రమోషన్లు వస్తేనే కానీ వారి స్థానాల్లో ఖాళీలు ఏర్పడవని, ఖాళీలు ఏర్పడితేనే కొత్త వారికి అవకాశాలు వస్తాయని, ఆ విషయాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్న న్యాయవాదులు గుర్తుపెట్టుకోవాలి శైలజ హితవు పలికారు. డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ (డీపీసీ) ప్రతి ప్రభుత్వ విభాగానికి ఉంటుందని, దానికి అనుబంధంగా డిపార్ట్మెంటల్ కన్ఫర్మేషన్ కమిటీ (డీసీసీ) కూడా ఉంటుందని, ఈ రెండు కమిటీలు ప్రమోషన్లు ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ప్రాసిక్యూషన్ విభాగానికి సంబందించిన డీపీసీ కమిటీ 2022 లోనే సమావేశం కావాల్సి ఉందని, అయితే అది వాయిదా పడుతుండటం వళ్ళ అసిస్టెంట్ పీపీల ప్రమోషన్లు వాయిదా పడుతున్నాయని ఆమె తెలిపారు పీపీల సర్వీస్ అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 16, 188 పై కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, నిజంగా న్యాయవాదుల ప్రయోజనాల కోసం పోరాడాలనుకుంటే ఉద్యోగాల భర్తీలకోసం, ఇతర హక్కుల సాధన కోసం పోరాడాలని, నిజమైన ప్రయోజనాల కోసం చేసే పోరాటాలకు తమ అసోసియేషన్ పూర్తి మద్దత్తు ఇస్తుందని శైలజ స్పష్టం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This