Friday, November 22, 2024
spot_img

ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్

Must Read
  • గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ నేడు దర్జాగా కొలువు
  • ప్లేట్ల బుర్జు దవాఖానాలో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్
  • డబ్బులు వసూల్ చేసి సహకరించిన ఉద్యోగులు
  • ఉద్యోగులపై వేటు వేసిన అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి
  • అప్పటి సూపరిటెండ్ నాగమణిపై బదిలీ వేటు
  • నేడు మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి
  • అవినీతి ఆరోపణలు వచ్చిన వారినీ తిరిగి తీసుకోవడంపై విమర్శలు

‘వైద్యో నారయణ హరి’ అంటారు దేవుడి తర్వాత దేవుడు వైద్యుడు కాబట్టి. బిచ్చగాడి నుంచి కరోడ్ పతి వరకు, సామాన్య వ్యక్తి నుంచి దేశ ప్రధాని వరకు ఎంత పెద్ద వ్యక్తికి అయినా రోగమొస్తే దవాఖానకే వెళ్లాల్సింది. డాక్టర్ చేయి పట్టుకొని చూస్తే చాలు ఇట్టే వ్యాధి నయమవుతుందని నమ్ముతుంటారు. అలాంటిది సర్కారు వైద్యులు కాడికిపోయేటందుకు ప్రజలు జంకుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి పోతే అట్నుంచి స్మశానానికి పోవుడు తప్ప ఇంటికి రావడం కష్టమే అనే నానుడి ఉంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఓ ఫేక్ డాక్టర్ గా చలామణి అవుతాడు. ఇప్పుడు నేటి సమాజంలో డబ్బు ఉన్నవారు లక్షలు పెట్టి, ఫైరవీలు చేసుకొని సీట్లు కొనుక్కొని డాక్టర్ చదువులు చదువుతున్నారు. ఆ తర్వాత ఏదో ఒక స్పెషలైజేషన్ కింద పీజీలు చేసి గవర్నమెంట్ డాక్టర్ కొలువు లేక, ఓ పెద్దాసుపత్రి పెట్టుకొని వైద్యులుగా కొనసాగుతున్నారు. పైసలు లంచంగా ఇచ్చి సీట్లు బ్లాక్ లో సంపాదించుకొని ఆ తర్వాత కూడా ఎగ్జామ్స్ నకలు కొట్టి చదవడం మూలంగా ఏ రోగానికి ఏ మందు గోలి ఇవ్వాలో తెలియక ఏదోఒకటి ఇచ్చి చివరకు ఎందరో పేదలను స్మశానానికి పంపుతారు. ఈ తతాంగం అంతా దర్శకుడు ఆ సినిమాలో చూపించినట్టుగానే వైద్యశాఖలో పనిచేసే కీలక వ్యక్తులు, పెద్ద డాక్టర్ల చేతులు తడిపి పరీక్షలో పాస్ అయ్యేలా చేసుకొని మెడికల్ ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ ను బకరా చేస్తారు.

ప్లేట్ల బుర్జు (జడ్జిఖానా) ఆస్పత్రి హైదరాబాద్ లో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన పీజీ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ ఎగ్జామ్స్ లో మాల్ ప్రాక్టీస్ పాల్పడేందుకు ఆ దవాఖానాలో పనిచేసే ఉద్యోగులు కొందరు సహకరించారు. వారిపై అవినీతి ఆరోపణలు వచ్చినందున సూపరిటెండెంట్ నాగమణి, ఉద్యోగులు జి.లక్ష్మీ, ఎం.క్రాంతికుమార్, వసుంధర, సిహెచ్.వెంకటేశ్ పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పీజీ స్టూడెంట్స్ కు చిట్టీలు ఇచ్చే కార్యంలో ముందున్న సూపరిటెండెంట్ నాగమణిని సస్పెండ్ చేయాల్సింది పోయి కొత్తగూడెం మెడికల్ కాలేజీకి ట్రాన్స్ ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు ఉన్నతాధికారులు. జూనియర్ అసిస్టెంట్ క్రాంతికుమార్ ను సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ విభాగానికి చెందిన సూపర్ వైజర్ వెంకటేశ్‌ను తొలగించారు. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వెంక‌టేశ్‌పై ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీకి చెప్పి మరీ విధులకు రావొద్దని హెచ్చరించింది.

పీజీ విద్యార్థుల వద్ద డబ్బు తీసుకొని మాల్ ప్రాక్టీస్ కు సహకరించినందుకుగాను సస్పెన్షన్, రిమూవ్ అయిన ఇద్దరినీ ప్రస్తుత సూపరిటెండెంట్ డాక్టర్ రజినీ రెడ్డి కొలువులోకి తీసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. గత ఫిబ్రవరిలో వాళ్లను తిరిగి పోస్టింగ్ లోకి తీసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ క్రాంతికుమార్ ను తిరిగి తీసుకోని అదే పోస్ట్ లో కూర్చొపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే ఔట్ సోర్సింగ్ లో సూపర్ వైజర్ గా పనిచేసిన వెంకటేశ్ ను కూడా అధికారులు తొలగించినా.. ప్రస్తుతం ఆయనను మళ్లీ తీసుకొచ్చి అదే స్థానం సెక్యూరిటీ, శానిటేషన్ సూపర్ వైజర్ బాధ్యతలు అప్పగించడం వెనుక ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు. పోలీసు కేసులు ఉండి సస్పెన్షన్ కు గురైన వారినీ సేమ్ పొజిషన్ లోకి తీసుకొని అక్ర‌మ వ‌సూలు చేస్తున్న‌ట్లు ఆరోపణలు వస్తున్నయి. ‘అందరికీ శకునం చెప్పే బల్లి.. తాను పోయి కుడితిలో పడ్డట్టు’ ఇదివరకే ఇక్కడున్న సూపరిటెండెంట్ సహా కొందరిపై వేటు పడిందని తెలుసుకొని జాగ్రత్తగా మేసులుకోవాల్సింది పోయి నాడు తప్పుచేసినోల్లను తీసుకొని ‘దొంగలకు తాళాలు ఇచ్చినట్టు’ చేయబట్టే.

గతంలో చేసిన ఈ ఇద్దరూ ఇప్పుడు అదే కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న వెంకట్ ‘చింత చచ్చినా పులుపు చావదన్నట్టు’ ఇంకా కూడా తన వంకర బుద్ధి మార్చుకోలేదు. మళ్లీ మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు గతనెలలో ఓ మహిళ అతనిపై హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పేదలకు మెరుగైన వైద్యం అందించే డాక్టర్లను తయారుచేసే పెద్ద డాక్టర్లు, ఉన్నతాధికారులు ఇలాంటి వాళ్లను ఆస్పత్రిలో పెట్టుకొవ‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సమ‌ని ప‌లువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే విష‌యంపై ఆదాబ్ ప్ర‌తినిధి, ఆస్ప‌త్రి సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి వివ‌ర‌ణ కోర‌గా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అయిన వెంక‌టేశ్‌ శ్రీ కాక‌తీయ సెక్యూరిటీ స‌ర్వీసెస్ ఏజేన్సీ ప‌రిధిలో విధులు నిర్వ‌ర్తించ‌డం జ‌రుగుతుంది. త‌న‌కు తొల‌గించే అధికారం లేద‌ని ర‌జినీ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆస్ప‌త్రి ప‌రిధిలో అనైతిక కార్య‌క్ర‌మాలకు పాల్ప‌డుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంక‌టేశ్ ప్ర‌వ‌ర్త‌న‌పై సెక్యూరిటీ ఏజెన్సీకి సూప‌రిండెంట్ ఫిర్యాదు చేసి, వెంట‌నే తొల‌గించ‌వ‌చ్చు.. కానీ, అత‌నిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి..

Latest News

జగన్ ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా మాజీ సీఎం, వైసీపీ అధినేత ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS