- ప్రజల్లో విసృత అవగాహాన అవసరం
- అనిశా దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడనిది అవినీతి.వంచన అయితే అవే నేటి సమాజంలో రాజ్యమేలుతుండటం దురుదృష్టకం : మహాత్మా గాంధీ.
“ప్రభుత్వ శాఖల అధికారులతో పని చేయించుకోవడం మన హాక్కు.దానిని లంచంతో కోనోద్దు”అన్నారు ఓ సీని రచయిత.అయినా అనేక ప్రభుత్వ కార్యలయాల్లో చేతులు తడపందే పనులు జరగడంలేదు.ఎవరికి వారు చైతన్యంతోనే వ్యవహారిస్తేనే అవీనితి అనే రాచపుండును నిర్మూలించవచ్చు.అయినా కూడా ప్రజల్లో మార్పు రావడం అలస్యమవుతుంది.అనిశా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు పత్రిక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.స్వచ్చంద సంస్థలు విద్యాలయాలు,ప్రజా సంఘాలు అవగాహాన పెంచుతున్నాయి.భావితరం ఇప్పటి నుంచే అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం పొందినట్లైతే ఆశించిన మార్పును సాకారం చేసుకోవచ్చు.నగరంలో అనిశా అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచగోండి సిబ్బందిను అరెస్టు చేస్తు భరతం పడుతున్నారు.దీంతో ప్రభుత్వ శాఖల సిబ్బంది అధికారుల గుండేల్లో రైల్లు పరిగెడుతున్నాయి.అనిశా విభాగం పనీతిరుపై ‘‘ఆదాబ్’’ పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇదీ నేపథ్యం..
ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న అవినీతిని నియంత్రించాల్సిన అవశ్యకతను ఐక్యరాజ్యసమితి దశాబ్దం క్రితం గుర్తించింది.2003 ఆక్టోబర్ 31 నాడు యూనైటెడ్ నేషన్స్ (ఐక్య రాజ్య సమితి) సదస్సులో ఐరాస జనరల్ ఆసెంబ్లి ఓ తిర్మానం చేసింది.సమాజ భద్రత,సుస్థిరత, ప్రజాస్వామ్యంలో నైతిక విలువలకు ముప్పుగా ఉన్న అవినీతిని నియంత్రించే దిశగా పలు కీలక తీర్మానాలు చేసింది.ఇవి డిసెంబర్ 2005లో అమల్లోకి వచ్చాయి.దీంతో అనిశా విభాగం లంచగోండి అధికారులపై ఎప్పటికప్పుడు ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించి వారి రెడ్ హ్యండ్ గా పట్టుకుని న్యాయ స్థానం ముందు ప్రవేశపెట్టి జైలుకు తరలిస్తున్నారు.
చిక్కులు తప్పవు..
ప్రభుత్వ ఉద్యోగి అనిశా (అవినీతి నిరోధక శాఖ) వలకు చిక్కితే ఇక అంతే,సంగతులు.విచారణ అనంతరం విజిలెన్స్ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు.ఘటన తీవ్రత ఆధారాలను బట్టి కేసు నమోదు చేస్తారు.లంచగోండి అధికారిపై కేసు నమోదై కనీసం 48 గంటలు జైళ్లో ఉంటే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు.ఒక వేళ ప్రాసిక్యూషన్‌కు సరిపోయే అధారాలు లేకుంటే ట్రైబునల్‌కు సిఫారసు చేస్తారు.కోర్టులో రుజువైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయేచ్చు.నేరం రుజువైతే గరిష్టంగా 5 ఏళ్లజైలు శాఖ పరమైన విచారణ చేస్తారు. విషయ తీవ్రతను బట్టి ర్యాంకు తగ్గించవచ్చు.అతి తక్కువ శిక్ష కింద ఇంక్రిమెంట్లును సైతం నిలిపివేయవచ్చు.
ఆకస్మిక తనిఖీలతో….!!
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యలయాలు,సబ్`రిజిస్టార్,ఆర్టీఏ,బల్దియా,రెవేన్యూ,ప్రభుత్వ ఆసుపత్రి, విద్యుత్‌శాఖ,ఇన్‌కమ్‌ట్యాక్స్,వసతిగృహాలు,తదితర సేవలు అందించే కేంద్రాల్లో అనిశా అధికారులు తరుచూ ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు.నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తూ పట్టుబడితే కేసు నమోదు చేస్తారు.కొన్ని సందర్బాల్లో ప్రసార మాధ్యమాలు,పత్రికలు, కథనాలను సుమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంబిస్తుంటారు.
సోమ్ము తిరిగిస్తారు..దగ్గరుండి పనిచేయిస్తారు :
అనినీతి అధికారి అడిగిన డబ్బును బాధితుడు తీసుకుని వస్తే మద్యవర్తి సమక్షంలో లెక్కిస్తారు.వాటికి రసాయనం పూసి బాధితుడికి ఇస్తారు.లంచగోండి అధికారి ఆ డబ్బును తీసుకున్న వెంటనే దాడి చేసి పట్టుకుంటారు.కొంతమంది లంచగోండులు తెలివిగా బాధితుడి వద్ద నుండి డబ్బు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందిని పురమాయిస్తారు.అలా సిబ్బంది రెడ్‌హ్యండ్‌గా దొరికితే అతడి వాంగ్మూలం ఆధారంగా ఉన్నతాధికారిపైనా కేసు నమోదు చేస్తారు.అనంతరం వారంలోపు బాదితుడిని న్యాయమూర్తి వద్దకు తీసుకేళ్లి 164 సెక్షన్ ప్రకారం వాంగ్మూలం ఇప్పిస్తారు.02 నెలలలోపు బాధితుడి సోమ్మును న్యాయస్థానం నుంచి తిరిగి ఇప్పిస్తారు.ఒక వేళ బాధితుడి పనిచట్ట పరిధిలోనే ఉంటే దాన్ని పూర్తిచేయించే బాధ్యతను అనిశా అధికారులు తీసుకుంటారు.కేసు కొలిక్కి వచ్చేసరికి రెండేళ్లు పట్టవచ్చు.ఈ కాలంలో బాధితుడు న్యాయస్థానానికి తిరగాల్సిన అవసరం లేదు.ట్రయల్స్ సమయంలో ఒక్కసారి వచ్చి రూఢీ పరిస్తే చాలు.
2022 -2024 ( నేటి వరకు నగరంలో నమోదైన అనిశా కేసులు వివరాలు )
రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా పరిధిలో 43 కేసులు నమోదయ్యాయి
అక్రమాస్తుల కేసులు -06
పట్టుబడ్డ గేజిటేడ్ అధికారులు -15 మంది
నాన్ గేజిటేడ్ అధికారులు -38 మంది
కార్పోరేట్ ఉద్యోగులు,ప్రైవేట్ ఉద్యోగులు -05 మంది
ACB OFFICERS PICTURES, HYD, RANGAREDDY
హైదరాబాద్ రెంజ్ -1 పరిధిలో నమోదైన కేసులు
మొత్తంగా నమోదైన కేసులు – 20
ఆక్రమస్తుల కేసులు -02
పట్టుబడ్డా గేజీటేట్ అధికారులు – 09 మంది
నాన్ గేజీటేట్ అదికారులు – 13 మంది
మొత్తంగా పట్టుబడ్డా అధికారులు 26మంది.
OFFICERS CAUGHT BY ACB NET, FILE PHOTO
హైదరాబాద్ రెంజ్-2 ,పరిధిలో నమోదైన కేసులు
మొత్తం 29 కేసులు నమోదు
ఆక్రమాస్తులు కేసులు -01
పట్టుబడ్డా గెజీటేడ్ అధికారులు -15 మంది
నాన్ గెజీటేట్ అధికారులు – 24 మంది
ప్రైవేటు వ్యక్తులు -10మంది.
తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు :
- కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారి శ్రీధర్ రెడ్డి,(డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అఫిసర్ ) రూ.02లక్షల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.కేసు నమోదు చేసిన అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
2.వాణిజ్య పన్నుల శాఖ విభాగంలో ఉద్యోగం చేస్తున్న బి.వసంత ఇందీరా,(డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫిసర్) రూ.35 వేలు లంచం డబ్బులు తీసుకుంటుడగా ఆనిశా అధికారులు దాడి చేసి రెడ్‌హ్యండ్ గా పట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసిన అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
3..జలమండలి విభాగంలో విధులు నిర్వహిస్తున్న మేనేజర్ స్పూర్తి రెడ్డి,నల్లా కనేక్షన్ కోసం రూ.30వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబిను ఆశ్రయించాడు.దీంతో అనిశా ఆధికారులు లంచం డబ్బును ఆఫిసులో పనిచేస్తున్న నవీన్‌గౌడ్‌కు ఇస్తున్న సమయంలో రెడ్‌హ్యండ్ గా పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
4.రంగారెడ్డి జిల్లా కలెక్టరెట్ కార్యలయంలో అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న ఏం.వీ భూపాల్ రెడ్డి,ఉద్యోగి, వై.మధన్ మెహాన్ రెడ్డి రూ.8లక్షల లంచం డబ్బులు తీసుకుంటుండగా అనిశా అధికారులు దాడి చేసి ఇద్దరిని రెడ్ హ్యండ్ గా పట్టుకుని కేసు నమోదుచేసి న్యాయస్ధానం ముందు హాజరుపరిచారు.
ఇలా చెప్పుకుంటు పోతే నగరంతోపాటు పోరుగు జిల్లాలలో ఇలాంటి కేసులు ఏదో ఒక చోటా నమోదు అవుతునే ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా రెంజ్ డీఎస్పీ ఏ.పీ.ఆనంద్ కుమార్ :
అవినీతి నిరోధక చట్టంపై అవగాహాన కల్పిస్తున్నాం.లంచం అడిగితే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్‌గా పట్టించవచ్చు.లంచం అడిగేవారిని అక్కడే నిలదీస్తే మరోసారి ఎవరు కూడా అలాంటి పనిచేయకుండా ఉంటారు.ధైర్యంగా ప్రజలు ఏసీబీకి సమాచారం ఇవ్వాలి.ప్రభుత్య కార్యాలయాల్లో ఎక్కడైన అవినీతి జరుగుతుందన్న సమాచారం వచ్చిన వెంటనే ఆకస్మిక దాడులు చేస్తున్నాం.
ప్రభుత్వ విభాగాలపై వచ్చే కథనాలు,ప్రసార మాధ్యమాలు,పత్రికల కథనాలపైన సమాచారంపైన కూడా అనిశా దృష్టి సారిస్తుంది.
హైదరాబాద్.రెంజ్ -1,డీఏస్పీ.కే.శ్రీనివాస్‌రెడ్డి :
ప్రభుత్వ కార్యలయల్లో పనిచేసే ఉద్యోగులు లంచం డబ్బులు అడిగితె వెంటనే ఏసిబి అధికారులకు ఫిర్యాదు
చేయాలి.ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచుతాం.అలాగే ప్రజల్లో కూడా మార్పు రావాలి.అనిశా విభాగం ఎప్పటికప్పుడు ఆకస్మికంగా దాడులు చేస్తునే ఉన్నారు.అవినితి ఆరికట్టడానికి ప్రజలు తమవంతుగా సహాకారం అందిచాలి.అప్పుడే కొంతవరకు అవినీతిని అరికట్టవచ్చు.
హైదరాబాద్ రెంజ్02,డీఏస్పీ శ్రీధర్ :
ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన దిశగా పనిచేస్తున్నాం.ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సి ఉంది.ఫిర్యాదులు వచ్చిన వెంటనే సిబ్బందితో కలిసి రంగంలోకి దిగుతున్నాం.అలాగే ఫిర్యాదుదారుని వివరాలను వెల్లడించడంలో గోప్యత పాటిస్తున్నాం.ప్రభుత్వ కార్యలయల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం.
ప్రజలు సమాచారం అందించాల్సిన నంబర్లు.
అనిశా జిల్లా రెంజ్ 01
డిఎస్పీ.కే.శ్రీనివాస్‌రెడ్డి
నెం : 9154388929
ఏసీబీ రెంజ్ 02
డీఎస్పీ,జీ.శ్రీధర్,
నెం: 9154388939.
రంగారెడ్డి రెంజ్ డీఎస్పీ,ఆనంద్‌కుమార్,
నెం: 9154388971
నగర కార్యలయం చిరునామా :
ఆఫీస్ ఆన్ డీఏస్పీ హైదరాబాద్ సిటి ఏసీబి ఏం8.మనోరంజన్ కాంప్లేక్స్ అజంతా గేట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర హైదరాబాద్.
- ఆదాబ్ హైదరాబాద్ సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ హాజీ