బాంగ్లాదేశ్ లో భారీ వరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.సుమారుగా 50 లక్షల మందికి పైగా ప్రజలు వరదలో చిక్కుకున్నారని,15 మంది మరణించారని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.వీధుల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.11 జిల్లాలో వరదల ప్రభావం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు బాంగ్లాదేశ్ కు వరుస కష్టాలు తప్పడం లేదు.రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.బాంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు.ఇప్పుడు తాజాగా ఆ దేశం భారీ వరదలతో అతలాకుతలం అవుతుంది.