Friday, September 20, 2024
spot_img

బాలికలకు నాణ్యమైన విద్య అందలనేదే బీబీజీ లక్ష్యం

Must Read
  • బీబీజీ చైర్మన్, ఎండీ మల్లికార్జున రెడ్డి

బాలికలకు నాణ్యమైన విద్య అందలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ మల్లికార్జున రెడ్డి తెలిపారు.బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నార్సింగిలో ఓం కన్వెన్షన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి రాశి సింగ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.బీబీజీ అసోసియేట్స్ నుంచి పది లక్షలు,మేనేజ్‌మెంట్ నుంచి ఇరవై లక్షల చెక్కును బీబీజీ ఫౌండేషన్‌కు రాశి సింగ్ ద్వారా ఇచ్చారు.ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ,ఈ విరాళంతో 2040 నాటికి ఇరవై లక్షల మంది బాలికలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.లింగ సమానత్వం,మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత భాగాన్ని బాలికలకు స్కాలర్‌షిప్‌లు,రివార్డులు,ఉన్నత విద్య కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు.అందరికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనేది భారతదేశంలోని అత్యుత్తమ ప్లాట్లు చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా గుర్తించబడిందని పేర్కొన్నారు.భూమి అభివృద్ధిలో అవార్డు కలిగిన సంస్థ అన్నారు.పదిహేడు సంవత్సరాలుగా సంతృప్తి చెందిన కస్టమర్లతో విజయవంతంగా సాగుతున్నామని వెల్లడించారు.లక్షా ఇరవై ఐదు వేలకు పైగా కస్టమర్లు కలిగి ఉన్నారని, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లో 240 ప్లాట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేశామని తెలిపారు.రియల్ ఎస్టేట్‌లో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని,బృందంలో అనుభవజ్ఞులైన నిపుణులు ఉన్నారని అన్నారు.బీబీజీ గ్లోబల్ ఇండియన్ బ్రాండ్‌గా రూపొందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మోటివేషనల్‌ స్పీకర్ సుదీర్ సంద్ర తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This