Friday, September 20, 2024
spot_img

బాలికా విద్యపైనే దృష్టి

Must Read
  • బీబీజీ సీఎండీ మల్లికార్జున రెడ్డి
  • ఘనంగా బీబీజీ అవార్డుల‌ వేడుక
  • సినీ నటి రీతూ వర్మ సందడి

బాలికా విద్యపైనే అత్యధికంగా దృష్టి సారించినట్లు బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) సీఎండీ మల్లికార్జున రెడ్డి తెలిపారు. బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల‌ వేడుక నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ అవార్డులను సినీ నటి రీతూ వర్మతో కలిసి ఆయన అందజేశారు. ఈ అవార్డులను 512 మందికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ బీబీజీ బంగారుతల్లి అనేది లాభాపేక్షలేని సంస్థ అన్నారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో విద్యాపరంగా ఎంతో మంది వెనుకబడి ఉన్నారన్నారు. ఈ వెనుకబడిన ప్రాంతాలలో.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బాలికల విద్య కోసం కృషి చేస్తున్నామన్నారు. బాలికా సాధికారతకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. 2040 నాటికి ఇరవై లక్షల‌ మంది బాలికలకు సాధికారత కల్పించడమే లక్ష్యమన్నారు.

ఈ సందర్భంగా సినీ నటి రీతూ వర్మ మాట్లాడుతూ తన విజయానికి తన తల్లి అందించిన సహకారం మరువలేనిదన్నారు. అప్పటి బలమైన విద్యా పునాదులే ముందుకు నడిపిస్తున్నాయని‌ చెప్పారు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో అధ్యాపకులు పోషించే పాత్ర కీలకమన్నారు. ఈ వేడుకలో రీతూ వర్మ బీబీజీ నుంచి బీబీజీ బంగారుతల్లి ఫౌండేషన్ కు 15 లక్షల చెక్కును అందజేశారు.

ఇప్పటి వరకు ఈ కార్యక్రమం లక్షా డెబ్బై వేల‌ మంది పిల్లలను శక్తివంతం చేసింది. బీబీజీ కోచ్‌లు నీరజ అంకపల్లి, కస్తూరి ఉష, పీ శ్రీనివాసరావు నాయకత్వంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నలబై వేల మంది బాలికలను చైతన్యపరిచారు. విద్య, మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. రాబోయే విద్యా సంవత్సరంలో ‘బంగారుతల్లి’ మరిన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించడం ద్వారా బాలికలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా లక్కీ డ్రా కూడా నిర్వహించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This