Thursday, February 20, 2025
spot_img

బిసి రిజర్వేషన్లపై చేతులు దులుపుకుంటే కుదరదు

Must Read
  • అసెంబ్లీలో అందుకు అనుగుణంగా బిల్లులు పెట్టాలి
  • బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌

మోసాలు చేయడంలో ఆరితేరిన గుణం కాంగ్రెస్‌ పార్టీదని, మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అదో దాఖాబాజ్‌ పార్టీ అని అన్నారు. జనగామ జిల్లా పర్యటనలో బీసీ బిల్లుపై కవిత స్పందించారు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు. అసెంబ్లీలో ఒక్క బిల్లు కాకుండా.. మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. విద్యలో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు తేవాలని.. ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 42 శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ఈ మేరకు బీసీలకు రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తేవాలన్నారు. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేస్తేను ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. కానీ, జాప్యం చేసి ఇతరులు కోర్టుకు వెళ్లే అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లుగా నిర్దిష్టమైన సమాచారం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడుతామని ప్రకటించిందని.. ఇదే బీసీలందరి తొలి విజయమన్నారు. మళ్లీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. 15 రోజుల కాకుండా నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో 60శాతం మంది తమ ఇళ్లకు సర్వే చేసే వారు రాలేదని అంటున్నారని.. రీ సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వాని సూచించారు. టోల్‌ ఫ్రీ నంబర్లను విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

Latest News

వనవర్తి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..

4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు వనపర్తి జిల్లాలోని బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS