Friday, November 22, 2024
spot_img

ఎస్ఎల్ గ్రూప్ ప్రాజెక్ట్స్ తో జరా భద్రం

Must Read
  • కస్టమర్స్ ను మోసం చేయడంలో సాయిలీలా గ్రూప్స్ దిట్ట
  • ప్రముఖ సినీనటులతో ప్రమోషన్స్
  • వందల మంది ఏజెంట్లతో దందా
  • ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన
  • అసలు వీరు అమ్మిన ప్లాట్స్ కి పర్మిషన్..రేరా అప్రూవల్ ఉందా.?
  • ఉంటె డెవలప్మెంట్ ఎందుకు పూర్తి కావడం లేదు..??
  • ఎస్ఎల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న అక్రమాలను వెలుగులోకి
    తీసుకువచ్చిన “ఆదాబ్ హైదరాబాద్” దినపత్రిక

సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల.ఈ కలను సాకారం చేసుకోవడానికి పైసా,పైసా కూడబెట్టి తమ కలలను సాకారం చేసుకుంటారు.మరికొంత మంది ఈఎంఐలు చెల్లిస్తు సొంతింటి కలను నెరవేర్చుకుంటారు.ఇలాంటి వారిని బురిడి కొట్టిస్తున్నాయి హైదరాబాద్ లోని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు.అమాయకులను మోసం చేస్తూ కోట్లలో దండుకుంటున్నారు.తీరా చుస్తే మొహం చాటేస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లోని ఎస్ఎల్ గ్రూప్ చేస్తున్న మోసాలను “ఆదాబ్ హైదరాబాద్” దినపత్రిక వెలుగులోకి తెచ్చింది.

హైదరాబాద్ లోని హబ్సిగూడాలో ఉన్న సాయిలీలా (ఎస్ఎల్) గ్రూప్స్ అమాయకులైన కస్టమర్స్ ను మోసం చేయడంలో దిట్ట.మాయమాటలతో తమ వ్యాపారం కోసం ప్రముఖ సినీ నటులతో ప్రమోషన్స్ చేయిస్తూ కస్టమర్స్ ను తమ వలలో వేసుకొని కోట్ల రూపాయలను తమ జేబుల్లో నింపుకుంటున్నారు.ఈ సంస్థకు చైర్మన్ గా ఉన్న నాగేశ్వర్ రెడ్డి,వెంకట రెడ్డి మ్యానేజింగ్ డైరెక్టర్,డైరెక్టర్స్ రమేష్,కుచిరెడ్డి,ప్రాజెక్టు మ్యానేజర్ సతీష్ రెడ్డి లు ఉన్నారు.గత 4 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వందల మంది ఏజెంట్లను నియమించుకుంటూ,డీటీసీపీ,హెచ్ఎండిఏ వెంచర్లు వేస్తూ,వాటిని డెవలప్ చేయకుండా కస్టమర్స్ ను నడిమిట్ల ముంచుతున్నారు. ప్లాట్లను రిజిస్ట్రేషన్స్ చేయకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతు కాలయాపన చేస్తున్నారు.తీరా చుస్తే మొహం చాటేస్తున్నారు.
వీరు చేస్తున్న అక్రమాల పై అనేక సందేహాలు కలుగుతున్నాయి.

అసలు వీరు అమ్మిన ప్లాట్స్ కి పర్మిషన్ ఉందా.? రేరా ఉన్నదా.? ఒకవేళ ఉంటె రేరా నిబంధనల ప్రకారం వాటిని అమలు చేస్తున్నారా.?
ఒకవేళ చేసిన్నట్టు అయితే ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఎందుకు పూర్తి కావడం లేదు.? ప్రి లంచ్ లో ప్లాట్స్ కొన్నవారి పరిస్థితి ఏంటి ..? అసలు యాజమాన్యం ప్లాట్లను ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు..?? కస్టమర్స్ వద్ద నుండి తీసుకున్న డబ్బులను ఎక్కడికి మళ్లించారు..??

ఈ సంస్థ చేస్తున్న అక్రమాలు,మోసాల పై త్వరలో ఆధారాలతో సహా మరిన్ని కథనాలను ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక వెలుగులోకి తీసుకురానుంది.మా అక్షరం-అవినీతి పై అస్త్రం

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS