Thursday, April 3, 2025
spot_img

“సన్ రైస్ టూ మూన్ లైట్” తో జరబద్రం

Must Read

స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్

  • కోట్లలో వసూలు చేస్తున్న “సన్ రైస్ మూన్ లైట్” కంపెనీ
  • వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్
  • ” న్యూట్రి కుక్” అనే పేరుతో కొత్త స్కీమ్
  • రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు అంటూ ఆఫర్స్
  • ఎక్కువ కమిషన్ పేరుతో మహిళలను రిక్రూట్ చేస్తూ కోట్లలో దందా

స్కింల పేరుతో స్కాంలు చేయడం,ఎక్కువ కమిషన్ ఇస్తానంటూ మహిళల చేత డబ్బులు కట్టించుకొని తన సంస్థలో జాయిన్ చేసుకోవడం,ఆ తర్వాత అదే మహిళలతో వ్యాపారం చేయించుకొని కోట్లలో దండుకోవడం ఇది “సన్ రైస్ టూ మూన్ లైట్” కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్ భాగోతం.మోసం చేయడంలో మహాదిట్టైనా ఇతగాడు వివిధ కంపెనీలు పెట్టి అమాయకులైన ప్రజలను బురిడీ కొట్టించడం ఇతని నైజాం.ఇప్పుడు ఈ సార్ గారు మరో కొత్త దందాకు తెరలేపారు.”న్యూట్రి కుక్” అనే పేరుతో ఒక బ్రాండ్ సృష్టించి వాటికి కొన్ని స్కింలను పెట్టి రూ 55,000/- కడితే 05 గిన్నెలు ,రూ 80,000/- కడితే 07 గిన్నెలు అంటూ ఆఫర్స్ పెట్టి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు.పైగా ఇతను చేసే వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా ఇంత లెవెల్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఇతగాడి సంస్థకు ఒక బోర్డు కూడా ఉండదు. పెద్ద లెవల్లో మల్టీ లెవల్ మార్కెటింగ్. ఇది అంతా చేసేది కలిదిండి పవన్ కుమార్.ఇతగాడి వలలో పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడానికి త్వరలో ఇతని బాగోతం మొత్తాన్ని ఆధారాలతో సహా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక (మా అక్షరం – అవినీతి పై అస్త్రం) బయటపెట్టబోతుంది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS