ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎదురుదెబ్బ తగిలింది.గురువారం రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హై కోర్టు స్టే విధించింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.గురువారం కేజ్రీవాల్ కి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.1 లక్ష పూచీకత్తుతో పాటు కొన్ని షరతులను విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు ఈడీ ఎలాంటి సాక్ష్యాలను సమర్పించలేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదించారు.దీనిని పరిగణంలోకి తీసుకున్న కోర్టు ఢిల్లీ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసింది.ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.ఈడీ పిటిషన్ స్వీకరించిన కోర్టు స్టే విధిస్తూ శుక్రవారం విచారణ జరుపుతామని,ఈలోపు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయవద్దు అని తెలిపింది.