- సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి
- విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
- మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన ప్రసూతి సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం నూతనకల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కేజీబివి లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఫార్మసీ స్టోర్ రిజిస్టర్ ని పరిశీలించి ఏమైనా మందులు అవసరం ఉంటే ముందుగానే తెప్పించుకొని ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ తో మాట్లాడుతూ హాస్పిటల్ కి వచ్చే వారికి ఎన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఒపీ రిజిస్టర్ ని పరిశీలించి హాస్పిటల్‌కి వచ్చే వారికి సిబ్బంది అందుబాటు లో ఉంటూ వైద్య సేవలు అందించాలని అన్నారు. ఎ యన్ యంలతో మాట్లాడుతూ ఎంతమంది ప్రసూతిలు రిజిస్ట్రేషన్ చేపించుకుంటున్నారని అలాగే ఎంత మంది ప్రభుత్వ హాస్పిటల్ నందు వైద్య సేవలు పొందుతున్నారని అడిగి తెలుసుకొని ప్రజలలో అవగాహన కల్పించి ప్రభుత్వ హాస్పి టల్ నందు ప్రసూతి సేవలు పొందేలాగా చూడాలని అలా గే సిజేరియన్లు చేయకుండా సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లకి, సిబ్బంది కి కలెక్టర్ సూచిం చారు.విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరో హించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నా రు. మంగళవారం నూతనకల్ మండలంలోని కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ స్టోర్ రూమ్‌ని పరిశీలించి మధ్యాహ్నం విద్యార్థులకి వడ్డించే భోజనాన్ని పరిశీలించి మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అన్నారు. తదుపరి పదవత రగతి గదిలో జరుగుతున్న హిందీ క్లాస్‌ని కలెక్టర్ సందర్శించి విద్యార్థులను హిందీ సబ్జెక్ట్ పై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థుల చూసి రాత నోట్స్ ని పరిశీలించారు. విద్యార్థులు మార్చి లో జరగబోయే పదవతరగతి వార్షిక పరీక్షలో నూరు శాతం ఉత్తిర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులు అసంపూర్తిగా ఉండటంతో సంబంధిత ఇంజనీరింగ్ అధికారితో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కే జి బి వి లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలియపర్చాలని సూచించారు. అంతకుముందు నూతనక ల్ మండలం గుండ్లసింగారం లోని అంగన్వాడీ కేంద్రం, ప్రా ధమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో మొత్తం ఏడు మంది ఉన్నారని ఈ రోజు నలుగు రు హాజరు అయినారని, వారికి ప్రాధమిక పాఠశాల లో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ కి అంగన్వాడీ టీచర్ వివరించారు. తదుపరి ప్రాధమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎక్కువ మంది పాఠశా లకి హాజరు అయ్యేలా ప్రజలకి అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకి సూచించారు. విద్యుత్ సమస్య ఉందని కలెక్టర్ కి తెలియపర్చగా సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ సి సూపర్ వైజర్లు చిన్ని, శ్రీలక్ష్మి స్టాప్ నర్స్ శైలజ, ల్యాబ్ టెక్నీషియన్ ఉష, యం యల్ హెచ్ పి లు శిరీష, మనీషా, దీపిక కేజీబివి ఉపాధ్యాయురాలు వీరలక్ష్మి, కవిత, జ్యోతి ప్రాధమిక పాఠ శాల ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, పద్మజ అంగన్వాడీ టీచర్ పద్మ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.