Thursday, November 21, 2024
spot_img

వర్షాకాలంఉరుములు,మెరుపులు,పిడుగులతో తస్మాత్ జాగ్రత్త..

Must Read

నైరుతి రుతపవనాలు రాష్ట్రం లో ప్రవేశించాయి .రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అవుతూ ఉంది.ఊరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడా కురుస్తుంది.ప్రజలకు, వాహన దారులకు పిడుగుల భయం పట్టుకుంది. వేసవి ముగియగానే పిడుగుల కాలం మొదలవుతుంది. కొన్ని వేల మెగా వాట్ల శక్తి కలిగిన పిడుగులు అటు జీవుల ప్రాణాలు తీయడంతో పాటు విలువైన వస్తువులను కాల్చి బూడిద చేస్తుంటాయి. వర్షాకాలం ఆరంభంలో ఆకాశంలో జరిగే ఒత్తిడి, అలజ డుల వల్ల పిడుగులు పడుతుంటాయి. వర్షం ప్రారంభం కాగానే నిర్లక్ష్యం విడిచి అప్రమత్తంగా ఉంటే పిడుగుల భారీ నుంచి కొంత వరకు బయట పడవచ్చు. ఆకాశంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడిన సందర్భాల్లో ఏదో ఒక చోట పిడుగు కాటుకు గురై ప్రతీ ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. మూగజీ వాలు సైతం పిడుగుకు బలై పోతున్నాయి. అధిక శాతం మంది పశువు ల కాపర్లు, వ్యవసాయ భూముల్లో పనిచేసుకునే రైతులు, కూలీలు ఎక్కు వగా ఉంటున్నారు. పిడుగు శబ్ధానికి కొందరు ప్రాణాలు వదులుతుండ గా, ఇంకొందరు దాని బయం, తీవ్రతకు బలవుతున్నారు. పిడుగులు పడే సమాచా రాన్ని విపత్తుల నివారణ శాఖ ముందుగానే పలు సందార్భాల్లో ప్రకటిస్తు న్నప్పటికీ ప్రమాదాలు తప్పడం లేదు.పిడుగుల బారి నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తతతో వ్యవహ రించాలి. గాలులు వీస్తున్నా, ఉరుములు ఉరిమినా పిడుగులు పడే ప్ర మాదం ఉంటుంది. ఆ సమయంలో సమీపంలో గల పెద్ద భవనాల్లోకి వెళ్లడం మంచింది. ఉరుములు, మెరుపులు, గాలి వాన సమయంలో ద్విచ క్రవాహనాలు,కారులు,ఆటోలు మిగతా వాహనాలు నడపడం మానుకోవాలి. లోహపు వస్తువులను తాకకుండా ఉండాలి. ఆరుబయట ప్రదేశాల్లో సెల్‌ఫోన్‌ వినియోగించవద్దు. ఉరుములు, మెరుపుల సమయంలో ఇళ్లలో తలుపులు, కిటికీలు మూసివేయాలి. ఇంట్లో విద్యుత్‌తో నడిచే అన్ని వస్తువులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి.రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత వల్ల పిడుగులు పడే సమాచా రాన్ని యాప్‌ ద్వారా సైతం తెలుసుకునే వీలుంది. యాప్‌ ద్వారా ఏ ప్రాం తంలో పిడుగు పడుతుందో కొంతవరకు తెలిసిపోతుంది. మనం ఎంత వరకు రక్షణ పొందవచ్చునో తెలుసుకునే వీలుంది. విపత్తుల నివారణ శాఖ సైతం వర్షం, పిడుగులు, ఉరుములు, మెరుపుల సమాచారాన్ని ఎప్ప టికప్పుడు ప్రకటిస్తుంటుంది. ముందుగానే ఆయా జిల్లా లలో కలెక్టరులు, మండలాల తహసీల్దా ర్లను, అధికారులను అప్రమత్తం చేస్తోంది. పిడుగుపాటుకు గురయ్యే స మయం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా విపత్తుల శాఖ అధికారులు కరపత్రాలు, వాల్‌ పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పిడుగు పాటుకు గురై మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు ప్రకృతి విపత్తు నష్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తుంటాయి. ఎర్తింగ్‌ తప్పకుండా ఏర్పాటు చేయాలి..

అధిక ఓల్టేజీ వచ్చి ఇళ్లలోని విద్యుత్తు గృహోపకరణాలు దగ్ధం అవు తుంటాయి. పిడుగులు పడే సమయంలో ఓల్టేజీ కొన్ని వందల రెట్లు పెరి గే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు ఇంటికి తప్పని సరిగా ఎర్తింగ్‌ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తీగలు, ఫ్యూజులు సైతం ఐఎస్‌ఐ మార్కు కలిగిన నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో అన్ని విద్యుత్తు గృహపకరణాలను బంద్‌ చేసి ఉంచడం, ఫ్లగ్‌ తీగలను తీసి ఉంచడం మంచిది. భవనాలు, ఇళ్లపై సైతం పంచలోహాలతో తయారు చేసిన పరికరాన్ని బిగించుకోవడం వల్ల కొంతమేర పిడుగు బారినుంచి తప్పించుకోవచ్చు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, భవనాలు, చర్చిలు, దేవాలయాలు, మజీదులపై ఇలాంటి పరికరాన్ని బిగించడం సాధారణంగా జరుగుతుంటుంది. చెట్ల కిందకు వెళ్లడం ప్రమాదం.పిడుగులు పడతాయన్న సూచనలు కనిపించే సమయంలో చెట్ల కిందకు వెళ్లడం మంచిది కాదు. పిడుగులు భూమి మీదకు వచ్చే సమ యంలో ఎత్తయిన చెట్లు, పచ్చిక మైదానాలు, కొండలు, లోహాలను ఆక ర్షిస్తాయి. చెట్ల కింద నిలుచున్న సమయంలో పిడుగులు పడితే శక్తి మనుషుల నుంచి ప్రసరించి ప్రమాదాల బారిన పడుతారు. ఆ సమయంలో నిలబడి ఉండటం కంటే నేలపై పడుకోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యం.అధిక జాగ్రత్తలు పాటిస్తే వానాకాలంలో పడే పిడుగుల బారి నుంచి రక్షణకు గురయ్యే అవకాశాలున్నాయి. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఉండ కూడదు. విద్యుత్‌ స్తంభాలు, తీగలకు సమీపంలో నిలబడకూడదు. ప్రధానంగా ఎత్తయిన ప్రాంతాలపై పిడుగులు పడే అవకాశాలున్నాయి. పంచలోహా పరికరాన్ని బిగించుకోవడం వల్ల పిడుగు బారి నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయి. ప్రమాదాలకు గురైతే తక్షణమే చికిత్స అందించాలి- వానాకాలం సీజన్‌లో పిడుగు ప్రమాదాలకు గురైన వ్యక్తులకు తక్ష ణమే చికిత్సలు అందించడానికి కుటుంబ సభ్యులు, ఇరుగు, పొరుగు ప్ర యత్నించాలి. సమీపంలో ఉన్న వైద్యశాలకు తీసుకవెళ్లి చికిత్స అం దించాలి. పిడుగులు పడిన సందర్భాల్లో శరీరం కాలి గాయాలు కావడం, అకస్మాత్తుగా గుండెపోటు రావడం, పిడుగు శబ్ధానికి చెవులు పనిచే యకపోవడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. సరియైన సమయం లో చికిత్స అందించడం వల్ల కొంత మేలు కలిగే అవకాశాలు వున్నాయి.ప్రతీ ఒక్కరూ పిడుగు ల గూర్చి ,వాని రక్షణ చర్యలు గూర్చి తెలుసుకోవాలి.ఆయా పాటశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకి అవగాహన కల్పించాలి.పట్టణాలు,నగరాలలో, గ్రామములలో అధికారులు, సిబ్బంది కూడా పిడుగు పాటు వల్ల జరిగే అనర్ధాలు,ముందు జాగ్రత్తలు మీద అవగాహన కల్పించాలి..కామిడి సతీష్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి.

తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
9848445134.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS