కులగణనకు బిజెపి వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సోమవారం హైదరాబాద్లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వేంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కులగణనకు చట్టబద్దత ఉందోలేదో చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కులగణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన చేపట్టబోమని బిజెపి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది..బిజెపి ద్వంద వైఖరిని బీసీలు ఖండించాలని అన్నారు.