Friday, November 22, 2024
spot_img

ఏపీ లో మళ్లీ బ్రాండెడ్ మద్యం

Must Read
  • ఆంధ్రప్రదేశ్ లో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది…
  • మళ్ళీ బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు..
  • ఈ నేపధ్యంలో దేశంలో పాపులర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ బీర్ ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్ లలో నిల్వ చేసారు..
  • త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి..

రాష్ట్రంలో లిక్కర్ పాలసీ పై చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక రివ్యూ చేసే అవకాశాలున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రభుత్వమే సొంతంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది.. బ్రాండెడ్ మద్యం నిలిపివేసి స్థానికంగా గుర్తింపులేని మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించింది..
ఇది పెద్ద స్కాం అంటూ టీడీపీ ఆదినుండి ఆరోపిస్తోంది.. మంత్రులు ముఖ్యమంత్రి మద్యం మాఫీయా గా మారారని విమర్శించింది..
తాజాగా లిక్కర్ స్కాం లో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి కార్యాలయం ఇళ్ల లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదుచేసింది. ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ… కంచికచర్ల వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐపీసీ 427, 379 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది.
గత గురువారం రాత్రి ఈ కేసు నమోదు కాగా… శుక్రవారం ఉదయమే విజయవాడ నుంచి సీఐడీ బృందాలు హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి రోజంతా సోదాలు చేశాయి. వైసీపీ(YCP) హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు, వారి సన్నిహితులు కలిసి… మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారనే అరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని, పత్రాల్ని, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS