Thursday, November 21, 2024
spot_img

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

Must Read
  • వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
  • నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
  • రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన విధంగా నడుస్తా
  • బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఒక కల మాత్రమే
  • టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.గురువారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలు,కమిషన్ ఛైర్మన్లు,నాయకులు మహేష్ కుమార్ గౌడ్ ను ఘనంగా సత్కరించారు.ఈ సంధర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ,బీసీ కులగణన పై బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న విమర్శల పై స్పందించారు.వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపారు.తన కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తానని వెల్లడించారు.తాను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన విధంగా నడుస్తానని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఒక కల మాత్రమేనని అన్నారు.సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ అంటున్నారు,పదేళ్ళ మీ పాలనలో తెలంగాణ తల్లి ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS