బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కోణతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళాపై జరిగిన లైంగిక దాడి ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేసి పీఎస్ కి తరలించారు.కోణతం దిలీప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేశారు.గత నేల 31న జైనూర్ లో ఆదివాసీ మహిళా పై లైంగిక దాడి జరగడం సంచలనంగా మారింది.దీంతో ఆదివాసీ సంఘాలు వారం రోజులుగా ఆందోళనను చేస్తున్నాయి.జైనూర్ లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.