Saturday, April 5, 2025
spot_img

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనదు : కేసిఆర్

Must Read
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 22 పేజీల లేఖ రాసిన కేసీఆర్
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనదు
  • .తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ అవమానిస్తుంది
  • రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ దయా భిక్షగా ప్రచారం చేస్తుంది
  • సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల
    ప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.ఇప్పటికే సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీను కూడా ఆహ్వానించింది కాంగ్రెస్ ప్రభుత్వం.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించినా విషయం తెలిసిందే.ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేసీఆర్‌ 22 పేజీల లేఖ రాశారు.తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ అవమానిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.కాంగ్రెస్ పోకడలు వీడి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలనీ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ దయా భిక్షగా ప్రచారం చేస్తుందని ఆరోపించారు.ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తశిక్తం చేసిందని , ఈ విషయం దాచితే దాగదని ఎద్దేవా చేశారు.సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని మండిపడ్డారు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎనాడు కూడా అమరవీరుల స్థూపాన్ని సందర్శించలేదని మండిపడ్డారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS