Friday, February 28, 2025
spot_img

మొయినాబాద్ లో కేబుల్ దొంగల బీభత్సం..!

Must Read

– బోరు మోటార్ల వైర్లు దొంగిలింపు
– అడ్డుకోబోయిన రైతుపై కత్తులతో దాడి
– మొయినాబాద్ మండలం మేడిపల్లిలో ఘటన
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

మొయినాబాద్ మండలం మేడిపల్లిలో కేబుల్ దొంగలు బీభత్సం సృష్టించారు. బోరుమోటార్లలోని వైర్లు దొంగ‌లించేందుకు వెళ్లిన వీళ్లు… ఏకంగా గ్రామానికి చెందిన రైతుపై కత్తులతో దాడి చేశారు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం… గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి గ్రామానికి చెందిన కే. రాజు, కొత్తపల్లి నరేందర్, ఎస్ అంతయ్య, పొద్దటూరి మల్లేశ్ పొలాల్లో ని నాలుగు బోర్లలో ఉన్న కేబుల్ వైరు, స్టార్టర్స్లో ఉన్న మీటర్లు దొంగతనం చేశారు. అక్కడి నుంచి అదే గ్రామానికి చెందిన మల్కాపురం ధనరాజ్ పొలానికి వెళ్లారు. అయితే వారం రోజులుగా దొంగతనాలు జరుగుతుండడంతో ధనరాజ్ అనే రైతు రాత్రి తన పొలం వద్దే పడుకుంటున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భార్య సరిత, కొడుకు జగదీశ్ ను కూడా తీసుకొని పొలం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న గుడిసెలో పడుకున్నాడు. 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు మాస్కులు వేసుకొని అక్కడికి వచ్చారు. అలికిడికి నిద్ర లేచిన సరిత ఎవరని అడగగా… చప్పుడు చేయకని వాళ్లు బెదిరించారు. దీంతో భర్త ధనరాజ్ ను నిద్రలేపగా వారిని బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో ఇద్దరిని తీసుకొని వచ్చి పైపులు, కత్తులు, కర్రలతో ధనరాజ్ పై దాడి చేశారు. భార్య, కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని తోసేసి ధనరాజ్ గొంతు, చెవి కోసి పారిపోయారు. కొడుకు జగదీశ్ వెంటనే ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇచ్చి వారి సాయంతో హైదరాబాద్లోని ప్రీమియర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మంగళవారం భార్య సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈమెతో పాటు కేబుల్ దొంగల బాధితులైన కే.రాజు, కొత్తపల్లి నరేందర్, ఎస్ అంతయ్య, పొద్దటూరి మల్లేశ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులను పట్టుకుంటాం : సీఐ పవన్ కుమార్ రెడ్డి
సమాచారం అందుకున్న మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. అక్కడికి డాగ్ స్క్వాడ్ ను పిలిపించి… ఆధారాలు సేకరించారు. చోరీల విషయమై గ్రామస్తులను ఆరా తీయగా.. గ్రామంలో ఇప్పటి వరకు 25 బోరు మోటార్లలో కేబుల్ దొంగిలించారని వాపోయారు. తాజా మాజీ సర్పంచ్ కూడా ఇందులో బాధితుడని చెప్పారు. బోర్లలో దొంగిలించిన వైరును కాల్చి అందులో జింక్ వైర్ ను అమ్ముకుంటున్నట్లు ఉన్నారని, ఓ రైతుకు చెందిన పొలంలోనే కాల్చారని.. ఆ ఆనవాళ్లు చూపించారు. పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉందని, వెంటనే దొంగలను పట్టుకోవాలని కోరారు. ఓ వ్యక్తి ఫ్యాషన్ ప్రో బైక్ పై పొలాల వద్ద తిరుగుతూ కనిపించాడని.. ఎవరని అడిగినా స్పందించలేదని కొందరు రైతులు చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హామీ ఇచ్చారు.

Latest News

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS