- పరారీలో టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి , సెక్రటరీ దొర , ట్రెజర్ లలితా
చిత్రపురి ప్రస్తుత కమిటీలో ఉన్న 11 మంది పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నాన్ బెయిల్ సెక్షన్స్ 409 , 120 బి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి.కేసు నమోదు కావడంతో టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి , సెక్రటరీ దొర , ట్రెజర్ లలితా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది.ఆఫీస్ కు తాళం వేసి , సొసైటీ అకౌంట్స్ ను ఫ్రిజ్ చేసి రికార్డ్ లు,హార్డీస్క్ లు స్వాధీనం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ అధికారులకు ఆదేశించారు. ఒక్క ఏడాదిలోనే సుమారు 200 కోట్ల వరకు స్కాం జరిగినట్టు తెలుస్తుంది.ట్విన్ టవర్స్ కాంట్రాక్టు ఇప్పిస్తానని కళ్యాణ్ రెండు కోట్లు తన పర్సనల్ అకౌంట్ కి తీసుకున్నట్టు వెల్లడైంది. ట్విన్ టవర్స్ ప్లాన్ అనేది పెద్ద బొకస్, పర్మిషన్ లేవని ఉద్యమకారులు చెప్పినా వినకుండా సుమారు 70 మంది కట్టి మోసపోయినట్లు గుర్తించారు.తన తండ్రి కాలు తీసేసారు దగ్గరుండి చూసుకోవాలని , చిత్రపురి స్కామ్ మొత్తం పాత కమిటీ చేసింది తాను కేవలం ఉద్యోగిగా వచ్చాను బెయిల్ ఇవ్వండి అని కోర్ట్ లో కోరారు వల్లభనేని అనిల్ కుమార్. ఇదిలా ఉంటె మిగితా కమిటీ సభ్యుల కోసం రాయదుర్గం పోలీసులు గాలిస్తున్నారు.బాధితులు ఏసీబీ కి పిర్యాదు చేశారు. అక్రమ ఆస్తుల కేసులో త్వరలో శిక్షలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా అందరం కలిసి చితపురి ను బాగుచేసుకుందాం అని ఉద్యకారులు కోరుతున్నారు.చిత్రపురి అవినీతి ఫై త్వరలో అధికారులు వీరబ్రహ్మయ్య, ధాత్రి దేవి, హరిత పైన కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.గత 9 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ హయాంలో జరిగిన చిత్రపురి వందల కోట్ల అవినీతి ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెలికి తీసి అక్రమార్కులకు శిక్ష వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.