- అనేక పథకాలకు నేరుగా నిధులు విడుదలవుతున్నాయి
- మీడియా సమావేశంలో చంద్రబాబు వివరణ
కేంద్ర బడ్జెట్(Budget Session 2025-26)లో ఏపీ పేరు ప్రస్తావించలేదన్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదన్నారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారని చెప్పారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్ఠంగా ఉపయోగించుకునే అవకాశం ఏపీకే ఉందని అన్నారు. ఈ మేరకు ఇదివరకే మేం ఆయా రంగాల్లో పాలసీలు తీసుకొచ్చాం. విభజన కన్నా వైకాపా పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఈ రెండు అంశాలను ఆర్థిక సంఘానికి వివరించి నిధులు కోరతాం‘ అని చంద్రబాబు తెలిపారు. సోమవారం ఆయ ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు. భారత్ అభివృద్ధిని ప్రపంచదేశాలు గమనిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఇటీవల దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించానని చెప్పారు. గతంలో ఐటీపై, ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మార్మోగుతోందన్నారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుంది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బ్జడెట్ కేటాయింపులు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పన్ను సంస్కరణల్లో చాలా మార్పులు జరిగాయి. విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే జరిగాయి. ఎంఎస్‌ఎంఈ పాలసీ గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకొస్తున్నారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతోంది. వృద్ధిరేటు పెంచేలా ఈ బ్జడెట్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యవేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారు. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యం. ఎవరికి ఓట్లు వేస్తే మంచి జరుగుతుందో ఆలోచించాలి.