బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హాసన్ తన పదవికి రాజీనామా చేశారు.శనివారం ఆందోళనకారులు పెద్దఎత్తున సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరుకొని కేవలం గంట వ్యవధిలోనే తన పదవికి ఒబైదుల్ హాసన్ రాజినామా చేయాలనీ,లేదంటే వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.దింతో బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేస్తునట్టు ఒబైదుల్ హాసన్ ప్రకటించారు.హాసన్ రాజీనామా చేసిన తర్వాత మరో 05 మంది న్యాయమూర్తులు తమ పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంలో చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా వ్యాపించింది.పెద్ద ఎత్తున విద్యార్థులు,నిరుద్యోగులు బాంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు,నిరసనలు చేశారు.దింతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆ దేశం విడిచి వెళ్లిపోయారు.మరోవైపు ఆందోళనల కారణంగా సుమారుగా 300 మంది మృతిచెందారు.