ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలిచిందని జంగయ్య యాదవ్ తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఎనుగుల కృష్ణప్రియకి రూ.60,000, బి.నరేందర్ గౌడ్కి రూ. 60,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జంగయ్యయాదవ్ మాట్లాడుతూ, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పేద ప్రజలు వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 70శాతం డబ్బుల రూపంలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, మేడ్చల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు దండు శ్రీకాంత్, మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి సంతోష్ గౌడ్, యువ నాయకులు వేముల రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.