- ఇతర రాష్ట్రాల నుండి పిల్లలను తీసుకొచ్చి ఏపీ,తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా
- మేడిపల్లిలో నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు
రాచకొండ పోలీసులకు సమాచారం - పిల్లలు లేని వారికీ ఢిల్లీ,పుణెల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నా వైనం
- ముగ్గురు నిందితుల అరెస్ట్
- ఇతర ముఠా సభ్యుల కోసం గాలింపు
- వివరాలను వెల్లడించిన సీపీ తరుణ్ జోషి
ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలో విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. సీపీ తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం శోభారాణి, సలీమ్, స్వప్న అనే ముగ్గురు నిందితులు మేడిపల్లిలో నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. పిల్లలు లేని వారికీ ఢిల్లీ, పుణెల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో దాడులు నిర్వహించామని వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో 23 రోజులు , నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులను రక్షించమని అన్నారు.ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను అరెస్ట్ చేశామని, మిగితా ముఠా సభ్యులను పట్టుకునేందుకు ఢిల్లీ , పుణేలకు ప్రత్యేక బృందాలను పంపినట్టు సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.ముఠా ఒక్కొ చిన్నారిని రూ.3.5లక్షలకు అమ్మినట్లు పోలీసులు నిర్ధారించారు.13మంది చిన్నారులను రక్షించమని , 11మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఇదిలా ఉంటె కొనుగోలు చేసిన తల్లిదండ్రులు చిన్నారులను తిరిగి అప్పగించాలంటూ రాచకొండ సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
.