Monday, September 8, 2025
spot_img

ఆర్టిస్ట్ సినిమా నుంచి చూస్తు చూస్తు… సాంగ్ రిలీజ్

Must Read

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “ఆర్టిస్ట్“. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. “ఆర్టిస్ట్” మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘చూస్తు చూస్తు..’ పాటను విడుదల చేశారు. ‘చూస్తు చూస్తు..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేయగా.. రాంబాబు గోసాల క్యాచీ లిరిక్స్ అందించారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. చూస్తు చూస్తు పాట ఎలా ఉందో చూస్తే.. ‘చూస్తు చూస్తు చూస్తు నిన్నే చూస్తుండిపోయా, చూస్తు చూస్తు నేనే నీవై పోయా, చూస్తు చూస్తు నువ్వే చేశావే మాయ.. చూస్తు గుండెల్లోనే దాచా చెలియా..’ అంటూ హీరో హీరోయిన్స్ మధ్య సాగే అందమైన ఈ పాటను హోలీ పండుగ నేపథ్యంలో కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This