Friday, September 20, 2024
spot_img

ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం

Must Read
  • సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం జేసింది
  • మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం
  • బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు
  • నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి
  • ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు
  • గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్, తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నయా ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూల్ చేస్తున్నానంటూ బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా నీచపు మాటలు మానుకోవాలని మంత్రి చురకలంటించారు. ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీకి ఉందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.200 కోట్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, అలాంటిది ధాన్యం కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని మంత్రి ప్రశ్నించారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డినని.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోనని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని, రూ.11 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని ఫైర్ అయ్యారు. మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు చేస్తున్న నేతలే గతంలో మిల్లర్లను ఇబ్బందులకు గురిచేశారు అని గుర్తుచేశారు. రూ 42 రూపాయలకు కిలో సన్న బియ్యం అమ్మితే ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. మిల్లర్ల వద్ద డబ్బులు తీసుకోవడం కాదు, కనీసం తాను వాళ్ళను తాను కలువ లేదని పేర్కొన్నారు. మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. మిల్లర్లు ఎవరు తప్పు చేసిన వారిపై తప్పకుండ చర్యలు తీసుకుంటామని వివరించారు. మాజీమంత్రి కేటీఆర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, బాధ్యత రహితమైన ఆరోపణలు చేస్తే చూసుకుంటూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే మహేశ్వర్ రెడ్డిని తామే పెంచి పోషించామని ఎద్దేవా చేశారు. మహేశ్వర్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓవర్ టెక్ చేసి బీజేపీలో ఓవర్ స్పీడ్ గా వెళ్లాలనే ఆలోచనతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వినతిపత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి.. లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్‌‌మెంట్ విషయాలు మాట్లాడినట్లు కాదని మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సచివాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక, బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్టు ఉన్నారని అన్నారు. ఢిల్లీకి డబ్బులు పంపించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడర్ పదవిని కొన్కున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This