మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది.బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది.ఏపీలోని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రూపాయల సాయాన్ని అందించింది.అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్ల రూపాయల సాయాన్ని అందించడం పై సీఎం నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఎక్స్ వేదికగా స్పందించారు.ప్రధాని మోదీతో పాటు,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు.ఏపీ పునర్నిర్మాణం కోసం కేంద్రం ప్రకటించిన బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ,ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించామని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.