Friday, September 20, 2024
spot_img

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా

Must Read
  • వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు
  • కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు
  • గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు
  • గుంతలు పూడ్చేందుకు తక్షణమే రూ.300 కోట్లు అవసరం
  • ఆర్ అండ్ బి సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
  • వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్.అండ్.బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.రోడ్ల దుస్థితి,నిధుల అవసరం,ప్రస్తుతం ఉన్న సమస్యలను ముఖ్యమంత్రికు అధికారులు వివరించారు.అనంతరం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల స్థితిగతుల గురించి పట్టించుకోకపోవడం వల్ల వాహనదారులు,ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు.వెంటనే రోడ్లను మార్చే పనులు మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశించారు.రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా గత ప్రభుత్వం నిధులు ఖర్చు చేయలేదని అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు చేసేందుకు వారు ముందుకు రావడం లేదని అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్స్ సమస్య ఉందని,తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణమే పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు.వీటి కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం ఉంటుందని వెల్లడించారు.పాత్ హోల్స్ పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.అత్యంవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైనా దృష్టిపెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు.ఆ తర్వాత రోడ్ల మరమ్మతులు,నిర్మాణంలో కొత్త,మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు.తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు,ప్రభుత్వ అధికారులు,నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.తక్కువ ఖర్చుతో,మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికు తెలిపారు. సాంప్రదాయ పద్దతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. నేల తీరు,ట్రాఫిక్ రద్దీ,వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు.వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికపైనా నిపుణులు సాధ్యాసాధ్యాలను వివరించారు.ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి,ఆ శాఖ అధికారులు,నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This