అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను గురువారం సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు దైర్యం ఇచ్చి,ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.01కోటి,తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు,స్వల్పంగా గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు చొప్పున సహయం అందజేస్తామని తెలిపారు.చికిత్స పొందుతున్న వారు త్వరగా కొలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాని అన్నారు.భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని,ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.