ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నీతి అయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.వికసీత్ ఏపీ-2047 రూపకల్పన పై ప్రతినిధులతో చర్చించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభవృద్ది చేసేలా ప్లాన్ రూపొందిస్తామని పేర్కొన్నారు.ఏపీలో ఉన్న వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చి,అందరికీ అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని,2047 నాటికి ఏపీని 02 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని నీతి అయోగ్ అధికారులకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.