Friday, September 20, 2024
spot_img

ఢిల్లీ కోచింగ్ సెంటర్ విపత్తుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

Must Read

దేశరాజధాని ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో గల సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ భవంతిని వరద ముంచెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరాతీశారు.తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌తో మాట్లాడిన సీఎం ఘ‌ట‌న వివ‌రాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవ‌రూ లేర‌ని తెలిపిన రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌ మృతుల్లో ఒకరైన తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని అని,ఆమె తండ్రి విజ‌య్ కుమార్ సింగ‌రేణి సంస్థ‌లో సీనియ‌ర్ మేనేజ‌ర్‌గా మంచిర్యాల‌లో ప‌ని చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు.బాధలో ఉన్న విజ‌య్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.తానియా సోని మృత‌దేహాన్ని బీహార్ త‌ర‌లించ‌డానికి వారి కుటుంబ స‌భ్యులు ఏర్పాటు చేసుకుంటున్నార‌ని,అవ‌స‌ర‌మైన స‌హ‌యం అందిస్తామ‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌరవ్ ఉప్పల్ తెలియజేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This