Thursday, August 7, 2025
spot_img

ఆమోదిస్తారా? గద్దె దించాలా?

Must Read
  • బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌
  • ఢిల్లీలో ‘చలో ఢిల్లీ’ ధర్నాలో సీఎం రేవంత్

తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశంపై కేంద్రం మొండి వైఖరిని అవలంబిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన ‘చలో దిల్లీ’ ధర్నాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. బీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రధాని మోదీ, బీజేపీ అడ్డుకుంటున్నారు. ఇది బలహీనవర్గాల పట్ల పెద్ద అన్యాయం. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుతామంటే గుజరాత్ వారికి ఎందుకింత కడుపుమంట? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న ప్రజాదరణను భయపడిన కేంద్రం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అడ్డుకుంటోందని ఆరోపించిన సీఎం రేవంత్, గల్లీలో ఉండలేక ఢిల్లీలో తేల్చుకుందాం అని ‘చలో దిల్లీ’ నిర్వహించాం అని చెప్పారు. ఈ ఉద్యమానికి ఇండియా కూటమిలోని పార్టీలు, వంద మందికిపైగా ఎంపీలు మద్దతు తెలిపారని వెల్లడించారు.

బీసీ రిజర్వేషన్ల కోసం నాలుగు కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. మోదీ, ఎన్డీయేకు జంతర్ మంతర్ వేదికగా సవాల్ విసురుతున్నాను. మా డిమాండ్లను ఆమోదిస్తారా? లేక మిమ్మల్ని గద్దె దించాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ మన బద్ధశత్రువు.. బలహీనవర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచనే ఆయనకు లేదు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులకు ఏమైంది? తెలంగాణలో ఓట్లు అడిగిన మీరు, ఇప్పుడు ప్రజలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో బీఆర్‌ఎస్‌ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. పేరు బంధం తెగిన తెరాస.. పేగు బంధం కూడా తెలంగాణతో తెగిందా? అంటూ చురకలేశారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ ముందుండి పోరాడుతుందని, కేంద్రం నిర్లక్ష్యాన్ని భరించేది లేదని సీఎం స్పష్టం చేశారు. బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.

Latest News

నేరాల ఛేదనకు కృత్రిమ మేధస్సు.. పోలీసులకు డిజిటల్ శిక్షణ

నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS