సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. వేములవాడ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదలు అందజేశారు.
ఈ పర్యటన సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం రూ.694.50 కోట్లతో వివిధ అభివృద్ది పనులను చేపట్టనున్నారు. రూ.76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ది పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేస్తారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ.45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుండి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
సిరిసిల్లలో రూ.26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని, వేములవాడలో రూ. 1 కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ.4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.