సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. బండ తిమ్మాపూర్లో రూ.1000 కోట్లతో నిర్మించిన కోకాకోలా పరిశ్రమను అయిన ప్రారంభించారు. కోకాకోలా కూల్ డ్రింక్ తయారీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు.