సాంకేతికత పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఆధునిక యంత్రాల ద్వారా యువత, యువ పారిశ్రామిక వేత్తలు, జీవనోపాధిని కల్పించడం లో, జీవన భద్రతను, పొందడంలో ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. నేటి ఆధునిక కాలంలో సమయం చాలా విలువైనదని,కాలంతో పాటు పరుగులు తీసి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్, బాలంరాయ్ . క్లాసిక్ గార్డెన్ లో వాణిజ్య ప్రదర్శన ప్రారంభం అయింది దేశ విదేశాలలో ఉత్పత్తి అయ్యే అత్యాధునిక సాంకేతికతను కలిగిన మెషిన్లను ఇక్కడ ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ పాల్గొని ప్రదర్శనను ప్రారంభించారు. స్టాల్స్ ను తిలకిస్తూ, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనకు జ్ఞాపిక అందచేసి శాలువతో సన్మానించారు.ఈ ప్రదర్శనలో నిర్వాహకులు వర్గాన్ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో బీ.పి.మిశ్రా, జాతీయ, రాష్ట్ర, స్థాయి మేర సంఘం, దర్జీ సంఘం నాయకులు పొడిశెట్టి నరసింగారావు, సంఘేవార్, డీకొండ నర్సింగ రావు, రమేశ్, శిరీష ప్రతిమ, తదితరులు పాల్గొన్నారు.