ప్రభుత్వం చేస్తున్న అవినీతిని పై ప్రశ్నింస్తున్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ పై కేసు నమోదు చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్.మంగళవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ పై కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కరీంనగర్ పరిషత్ సమావేశంలో పాడికౌశిక్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ని అడ్డుకున్నారు.దింతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.పోలీసులు పాడి కౌశిక్ పై కేసు నమోదు చేశారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు.బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడరని తెలిపారు.కేవలం ప్రతిపక్షాలను బెదిరించాలనే ఉద్దేశ్యంతోనే కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశ్నించే నాయకుల పైన కేసులు పెట్టడం ప్రజా పాలననా అని ప్రశ్నించారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారని విమర్శించారు.బీఆర్ఎస్ కార్యకర్తల పైన,మీడియా పైన అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని,ఇందిరమ్మ పాలనా అంటే ఇదేనా అని ప్రశ్నించారు.