Thursday, December 26, 2024
spot_img

ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు

Must Read
  • బతికినన్న రోజులు అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌
  • వాజ్‌పేయ్‌ శతజయంతి వేడుకల్లో కిషన్‌ రెడ్డి, బండి

ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్‌ అవమానించిందని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ ఓడిరచిందని తెలిపారు. మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌తో నెహ్రూ రాజీనామా చేయించారని పేర్కొన్నారు. 954 నుంచి 88 వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ సహా 21 మందికి కాంగ్రెస్‌ భారతరత్న ఇచ్చిందని.. కానీ అంబేడ్కర్‌ను ఎందుకు విసర్మించిందో సమాధానం చెప్పాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో అంబేడ్కర్‌ ఫొటో కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని కిషన్‌ రెడ్డి తెలిపారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్‌పేయీ అని.. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పనిచేశారని చెప్పారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజా తీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం వాజ్‌పేయీ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వాజ్‌పేయీ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడారు. వాజ్‌పేయీ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారని పేర్కొన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా.. ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారని కొనియాడారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ భాజపా అన్నారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్‌ అని ఎద్దేవా చేశారు. అబద్దాల్లో ఆ పార్టీకి ఆస్కార్‌ అవార్డు ఇవ్వవచ్చన్నారు. బడుగు, బలహీనర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి (ఖఓ ఓనీటతి) మద్దతుగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమ్యూనిస్టు వేషాన్ని వేసుకొని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. ఆ పార్టీ నేతలు భాజపా, కేంద్ర ప్రభుత్వం విూద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. దేశానికి వెన్నుపోటు పొడిచి.. విూడియా ముందుకొచ్చి మొసలి కన్నీరు కారుస్తానంటే ఎవరు నమ్మరని ఎద్దేవా చేశారు. సైనికులను కూడా కాంగ్రెస్‌ పార్టీ అవహేళన చేసి మాట్లాడుతోందని మండిపడ్డారు.

Latest News

మిత్రపక్షాల మధ్య మరింత సమన్వయం

నడ్డా నివాసంలో ఎన్టీఎ పక్షాల భేటీ అమిత్‌ షా, చంద్రబాబు తదితరుల హాజరు మిత్రపక్షాల సమన్వయం పార్లమెంట్‌ లోపల, బయటా మరింత పెంచుకోవడంపై ఎన్డీయే పక్షాలు దృష్టి సారించాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS