తెలంగాణలో ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..
కేసీఆర్ చేసిన పాపానికి ఇప్పటికి శిక్ష అనుభవిస్తున్నారు..
విద్యుత్ రంగంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి,
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఆర్టీజన్లు అని నామకరణం చేసి చేతులు దులుపుకున్నాడు..
ఇప్పటికి పర్మినెంట్ కాక, వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీతో పై అధికారుల ఒత్తిడికి గురవుతున్నారు..
చాలిచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు!
రాష్ట్రానికి వెలుగులు ఇచ్చే ఆర్టిజన్లు ఇప్పుడు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి..
మొన్నటి ఎన్నికల్లో ఆర్టిజన్లకు మేము అండగా ఉంటామని గద్దెనెక్కిన హస్తం పార్టీ నేతలు,
ఇప్పుడు కార్మికుల బాధలు చెప్పుకుందామంటే అపాయిమెంట్ ఇస్తలేరు..
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నా తప్పిదాలను చూస్తుంటే, గత సర్కార్‌కి, ఇప్పటి ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదనిపిస్తుంది..
- అంజి