Sunday, April 20, 2025
spot_img

తాండూర్‌లో పేరిగిపోతున్న సైబర్‌ మోసలు

Must Read
  • వ్యాపారస్తులే టార్గెట్‌.. ఫోన్‌ పే గూగుల్‌ పే ద్వారా రిక్వెస్ట్‌ పేమెంట్‌ పంపించి కొనుగోలు
  • తెలియక వ్యాపారస్తులు బోల్తా.. అయోమయంలో వ్యాపారస్తులు

తాండూర్‌ వ్యాపార కేంద్రంగా ఉండడంతో సైబర్‌ (cybercrime) మోసగాళ్లు ఈ కేంద్రాన్ని అదునుగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు ఇటీవల కర్ణాటకలో దొంగలించిన మొబైల్‌ తోఫోన్‌ పే,గూగుల్‌ పే ద్వారా తాండూర్‌ వ్యాపారస్తుల నుండి డబ్బులు తీసుకోవడంతో ఇచ్చిన తాండూర్‌ వ్యాపారస్తులు సైబర్‌ కేసులలో ఇరుక్కొని వారి అకౌంటు ప్రిజ్‌ అయ్యాయి ఇది మరవకముందే మరో ఘటన తాండూరు లో ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా రిక్వెస్ట్‌ పేమెంట్‌ పంపిస్తూ వ్యాపారస్తుల ద్వారా తనకి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తూ వ్యాపారస్తులకు టోకరా పెడుతున్నారు. వ్యాపారస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గుర్తు తెలియని యువకుడు ఓ కిరణ్‌ కొట్టుకు వెళ్లి తనకు ఆయిల్‌ డబ్బలు 2 కావాలంటూ బేరసారా లు చేశాడు. దీంతో ఆ కిరాణా యాజమాని 4600 రూపాయలు అవుతాయని తెలిపాడు దీంతో తొందరగా ఇవ్వాలని చెప్పి ఫోన్‌ పే ఉందా లేదా గూగుల్‌ పే ఉందా అని ఆ యువకుడు అడిగాడు దీంతో వ్యాపారస్తుడు ఫోన్‌ పే ఉందని తెలపడంతో అతనికి ఫోన్‌ పే ద్వారా పేమెంట్‌ పంపించాడు. దీంతో ఆ కిరాణా యజమాని ఫోన్లో వచ్చిన ట్రాన్జక్షన్‌ మాత్రమే చూసుకొని వచ్చాయని నమ్మబలికి డబ్బాలను తీసుకువెళ్లాడు. మరోవైపు ఇంకో షాపు నందు కూడా బియ్యం బస్తాలు కావాలంటూ అక్కడ కూడా ఇదే తరహాలో 4500 రు, మరో షాపులో సంతూర్‌ సోప్‌ కాటన్‌ లు కావాలంటూ అక్కడ కూడా 6000 రూపాయల కొనుగోలు చేసి అక్కడ కూడా రిక్వెస్ట్‌ పేమెంట్‌ పంపించి వెళ్ళిపోయాడు. వ్యాపారస్తుల తమ అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో తాము మోసపోయినట్లుగా గుర్తించుకున్నారు. తీరా ఆ వ్యక్తి కోసం గాలించిన, ఎంక్వయిరీ చేసిన ఫలితం దక్కలేదు. ఫోన్‌ పే రిక్వెస్ట్‌ నందు విశాల్‌ పేరుగా ఉంది. ఆ యువకుడు దారూర్‌ లో ఫంక్షన్‌ ఉన్నట్లుగా అందుకు వస్తువులు అవసరం ఉన్నట్లుగా తెలిపినట్లుగా సమాచారం. ఈ విధంగా తాండూర్‌ వ్యాపార కేంద్రంగా ఉన్న వ్యాపారస్తులను టార్గెట్‌ చేస్తూ రిక్వెస్ట్‌ పేమెంట్లను పంపిస్తున్నారని వ్యాపారస్తులు అయోమయం లో గురై తమ వస్తువులను కోల్పోతున్నారు. కావున జాగ్రత్తలు పాటించాలని పలువురు పేర్కొంటున్నారు

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS