Friday, November 22, 2024
spot_img

మళ్లా ‘దక్షిణ మూర్తి’ దర్శనం

Must Read
  • మూడు దశబ్ధాలుగా డీఎస్ఈలో తిష్ట
  • మొన్న జనరల్ ట్రాన్స్ ఫర్స్ లో సూర్యాపేటకు బదిలీ
  • నిన్న తిరిగి సొంత గూటికి రాక
  • అదే స్థానం అప్పగించిన ఉన్నతాధికారులు
  • గతంలో దక్షిణమూర్తి యధేచ్చగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు
  • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతర్
  • ఏళ్లుగా ఒకేచోట ఉన్నవాళ్లనూ ట్రాన్స్ ఫర్స్ చేసేలా సాధారణ బదిలీలు
  • ఈయన లేనిదే పనికావట్లేదని డిప్యూటేషన్ పై తీసుకొచ్చుకున్న అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్‌

కొందరికీ ‘దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు’ అంటుంటారు. కానీ ఈ వార్త చదివితే.. దేవుడికే ఈయన వరమిచ్చేవాడు అంటారు కావొచ్చు. చేసేది ప్రభుత్వ ఉద్యోగం అయినా సొంత వ్యాపారంలా, దానికి యజమాని ఆయనే అనేంతగా.. అంత:కర్మ శుద్ధితో పనిచేస్తాడు. ఒక్కరోజు కార్యాలయానికి రాకున్న ఎవరూ ఏం చేయాల్నో, ఎలా చేయాలో కూడా తెల్వదు. ఆయనెవరో కాదు డీఎస్ఈలో పనిచేసే ఏడీ దక్షిణ మూర్తి. ఇతగాడి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వివరాల్లోకి వెళితే.. డిపార్ట్ మెంట్ స్కూల్ ఎడ్యూకేషన్ లో అడిషనల్ డైరెక్టర్ పనిచేసే దక్షిణ మూర్తి. ఈ సారు గత మూడు దశాబ్ధాలుగా హెడ్ ఆఫ్ ఆఫీస్ (హైదరాబాద్)లో పనిచేశారు.’నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది’ అన్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లో పెద్ద తలకాయ అయిన దక్షిణ మూర్తిదే రాజ్యం. ఆయన చెప్పిందే వేదం..గతంలో ఇక్కడ త్రిమూర్తులు తిష్టవేసి కూర్చున్నారు. ముగ్గురు అధికారులు డీఎస్ఈలో 30ఏళ్లుగా పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖను అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చిన పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారిన వీళ్లు మాత్రం పాలకులతో అంటకాగుతూ అదే స్థానంలో కొనసాగుతూ అరాచకాలకు పాల్పడుతూ వచ్చారు. ఈ విష‌యంపై జులై 18న ఆదాబ్ హైద‌రాబాద్ తెలుగుదిన‌ప‌త్రికలో డీఎస్ఈలో తిష్ట‌వేసిన త్రిమూర్తులు అనే శిర్షిక‌న క‌థ‌నం కూడా ప్ర‌చురించ‌డం జ‌రిగింది.

కానీ, రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల సాధారణ బదిలీలు చేపట్టింది. తొలుత వీళ్లు ఇక్కడే ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నాలు కొనసాగించారు. చివరకు ట్రాన్స్ ఫర్స్ లో భాగంగా ముగ్గురూ డీఎస్ఈని వీడి వెళ్లిపోయారు. అంతా దరిద్రం పోయింది అనుకున్నారు. కారణమేమంటే ఏళ్లుగా అక్కడే ఉంటూ కిందిస్థాయి ఉద్యోగులను ఘోసపెట్టించుకున్నారు. తెలంగాణలో చాలా ఏళ్లుగా ఉద్యోగుల్లో ట్రాన్స్ ఫర్స్ లేక లేక ఎక్కడివారు అక్కడే పాతుకుపోయారనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం జనరల్ ట్రాన్స్ ఫర్స్ తీసుకొచ్చింది. బదిలీల్లో ఏడీ దక్షిణమూర్తి సూర్యాపేట జిల్లాకు ట్రాన్స్ ఫర్ అయ్యారు.వెళ్లిపోయాడులే అనుకుంటే అలా వెళ్లి,ఇలా వచ్చేశారు పెద్దసారు.

అసలు ఏం జరిగిందంటే గతంలో డిపార్ట్ మెంట్ స్కూల్ ఎడ్యూకేషన్ లో ద‌క్షిణ‌మూర్తి ఎస్టాబ్లిష్ డిపార్ట్ మెంట్ లో ఏడీగా విధులు నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఈయన బదిలీపై వెళ్లేసరికి డీఎస్ఈలో పనులు మొత్తం ఆగిపోయాయంట. ఎవరికీ ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదనే, కనీసం మా ఉద్యోగులకు పాలుపోవడం లేదు కాబట్టే డిప్యూటేషన్ పై దక్షిణమూర్తిని తిరిగి తీసుకొచ్చామని అడిషనల్ డైరెక్టర్ లింగయ్య చెప్పుకొచ్చారు. డీఎస్ఈలో అలవాటు పడ్డ మూర్తిగారు ఎటూ వెళ్లి, ఎక్కడా పనిచేయడం ఇష్టం లేక తిరిగి ఇక్కడికే వచ్చి ఉద్యోగం ఎలగబెట్టాలని కుట్రలు చేశాడు. ‘దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడన్నట్టు’ ఎంతో మంది డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెద్ద సారునే మళ్లా తీసుకొచ్చి అదే డిపార్ట్ మెంట్ లో సేమ్ సీటులో కూర్చోబెట్టడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడం లేదు. పెద్దసారు బదిలీపై సూర్యాపేట వెళ్లినాటి నుంచి ఆ స్థానాన్ని ఆయన కోసమే ఖాళీగా ఉంచి.. శతవిధాలా ప్రయత్నించి పెద్ద పెద్ద ఫైరవీలు చేసి ‘దక్షిణమూర్తిని’ దర్శనం చేపించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో,ప్రభుత్వం జూలైలో విడుదల చేసిన జీవో ఎంఎస్‌. నెం 80 తేది 3-7-2024 ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ తుంగలో తొక్కినట్టే అవుతుంది. ఎందుకంటే మూడు దశాబ్ధాలు ఇక్కడే పనిచేసే అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారిని తిరిగి డీఎస్ఈకి తీసుకురావడం విడ్డూరం. సుదీర్ఘ కాలంగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్, డైరెక్టర్ కార్యాలయములో పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ దక్షిణమూర్తి ఇక్కడికి తిరిగి రావడాన్ని పలువురు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS